Anderson Breaks 72 years Old Record In Vizag Test: ఇంగ్లండ్ లెజెండరీ పేసర్ జేమ్స్ అండర్సన్(James Anderson)లేటు వయసులో కూడా అద్భుతమైన బౌలింగ్ తో అదరగొడుతున్నాడు. విశాఖపట్నం వేదికగా టీమిండియా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఈ వెటరన్ పేసర్ మూడు వికెట్లుతో సత్తా చాటాడు. ఈ క్రమంలో భారత గడ్డపై ఓ రేర్ ఫీట్ ను సాధించాడు. ఇండియాలో టెస్టు మ్యాచ్ ఆడిన అతి పెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. టీమిండియా మాజీ క్రికెటర్ లాల్ అమర్‌నాథ్(Lal Amarnath) పేరిట ఉన్న 72 ఏళ్ల రికార్డును అండర్సన్ బద్దలు కొట్టాడు. ప్రస్తుతం జరుగుతున్న వైజాగ్ టెస్టు నాటికి అండర్సన్ వయసు 41 సంవత్సరాల 187 రోజులు. 1952లో అమర్‌నాథ్ 41 ఏండ్ల 92 రోజుల వయసులో దాయాది పాకిస్థాన్‌పై టెస్టు మ్యాచ్ ఆడాడు. తాజాగా అమర్ నాథ్ రికార్డును అండర్సన్ బ్రేక్ చేశాడు.
ప్రపంచంలోనే అత్తుత్యమ బౌలర్లలో ఒకడైన అండర్సన్ మరో ఏడు వికెట్లు తీస్తే 700 క్లబ్‌లో చేరుతాడు. ఇతడి కంటే ముందు ముత్తయ్య మురళీధరన్, దివంగత షేన్ వార్న్ మాత్రమే 700 పైగా వికెట్లు తీశారు. వైజాగ్ టెస్టు(IND vs ENG 2nd Test) తొలి ఇన్నింగ్స్ లో అండర్సన్ శుభ్‌మన్ గిల్(34), డబుల్ సెంచరీ హీరో యశస్వీ జైస్వాల్(209), అశ్విన్ (20) వికెట్లును తీశాడు. రెండో రోజు ఆట కొనసాగించిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 396 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఇంగ్లండ్ ఓపెనర్లు దూకుడుగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగులెత్తింది. ఓపెనర్ జాక్ క్రాలే(76) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. దీంతో ఇంగ్లీష్ జట్టు టీ విరామానికి టీ సమయానికి 4 వికెట్ల కోల్పోయి 155 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లీష్ జట్టును బుమ్రా, కులదీప్ దెబ్బతీశారు. వీరి ధాటికి ఆ జట్టు 55.5 ఓవర్లలో 253 పరుగులకు ఆలౌట్ అయింది. బుమ్రా ఆరు వికెట్లు పడగొట్టాడు. దీంతో టీమిండియాకు 143 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
No clouds. All class. #INDvENG #JamesAnderson pic.twitter.com/QAnGYe0xO9
— ESPNcricinfo (@ESPNcricinfo) February 3, 2024
Also Read: IND vs ENG 2nd Test Live: డబుల్ సెంచరీతో చెలరేగిన యశస్వి.. మూడో భారత బ్యాటర్‌గా ఘనత..
Also Read: Agni Chopra: చరిత్ర సృష్టించిన 12th ఫెయిల్ డైరెక్టర్ కొడుకు.. క్రికెట్ హిస్టరీలో ఒకే ఒక్కడు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి