IND Vs NED World Cup 2023: చివరి లీగ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్.. తుది జట్లు ఇలా..!

India Vs Netherlands World Cup 2023 Updates Toss and Playing 11: భారత్-నెదర్లాండ్స్ జట్ల మధ్య వరల్డ్ కప్‌లో చివరి లీగ్ మ్యాచ్‌ ఆరంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన టీమిండియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. పూర్తి వివరాలు ఇలా..

Written by - Ashok Krindinti | Last Updated : Nov 12, 2023, 02:09 PM IST
IND Vs NED World Cup 2023: చివరి లీగ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్.. తుది జట్లు ఇలా..!

India Vs Netherlands World Cup 2023 Updates Toss and Playing 11: వరల్డ్ కప్‌ 2023లో చివరి లీగ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. వరుస విజయాలతో సెమీస్‌కు చేరిన టీమిండియా.. నేడు నెదర్లాండ్స్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధించి.. సెమీస్‌కు పూర్తి ఆత్మవిశ్వాసంతో సిద్ధమవ్వాలని చూస్తోంది. ఈ టోర్నీలో అంచనాలను మించి రాణించిన నెదర్లాండ్స్.. రెండు విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఇందులో సౌతాఫ్రికాపై సంచలన విజయం కూడా ఉంది. భారత్‌పై విజయం సాధించి.. మరో సంచలనం సృష్టించాలని చూస్తోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నామమాత్రపు మ్యాచ్‌ కావడంత రిజర్వ్ బెంచ్‌కు అవకాశం వస్తుందని అందరూ భావించినా.. సెమీస్‌కు ఎలాంటి ప్రయోగాలకు చోటు లేకుండా గత టీమ్‌తోనే భారత్ బరిలోకి దిగుతోంది. నెదర్లాండ్స్‌ కూడా చివరి మ్యాచ్‌లో ఆడిన టీమ్‌తోనే రెడీ అయింది.

"మా దగ్గర మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. బ్యాటింగ్ తీసుకోవడానికి ప్రత్యేక కారణం లేదు. మేము మొదట బ్యాటింగ్ చేసినా లేదా ముందుగా బౌలింగ్ చేసినా.. గత మ్యాచ్‌ల్లో బాగా ఆడాం. ఈ రోజు బాగా ఆడటానికి.. అన్ని చెక్ చేసుకోవడానికి మరో అవకాశం. ఈ టోర్నీలో మేం బాగా ఆడినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎలాంటి సమయాల్లో నిలబడి బాధ్యతలు స్వీకరించిన కుర్రాళ్లకు హ్యాట్సాఫ్. అదే టీమ్‌తో ఆడుతున్నాం.." అని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. 

"టాస్ గెలిచి ఉంటే మేము కూడా బ్యాటింగ్ చేసి ఉండేవాళ్లం. చాలా మంచి వికెట్ లాగా ఉంది. కానీ ఛేజింగ్‌కు మంచి గ్రౌండ్. మొత్తగా మా ఆటతీరు బాగుంది. కొన్ని మ్యాచ్‌లు బాగా ఆడాం. మేము రెండు విజయాలు సాధించాము. ఈరోజు మంచి ప్రదర్శన ఇవ్వాలని చూస్తున్నాం.. మేం ఆడిన మ్యాచ్‌ల్లో ఎక్కువ మంది ప్రేక్షుకులను ఇక్కడే చూస్తున్నాం. ఇక్కడ ఉండబోయే వాతావరణం కోసం ఎదురు చూస్తున్నాము. భారతదేశం దోషరహితంగా ఉంది. భారత్‌పై గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాం.." అని నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ తెలిపాడు.

తుది జట్లు ఇలా..

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్

నెదర్లాండ్స్: వెస్లీ బరేసి, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్‌మాన్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్ (వికెట్ కీపర్, కెప్టెన్), బాస్ డి లీడే, తేజా నిడమనూరు, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దట్ట్, పాల్ వాన్ మీకెరెన్.

Also Read: Samsung Galaxy A25 5G Price: దీపావళి సందర్భంగా సాంసంగ్ గుడ్ న్యూస్‌..మార్కెట్‌లోకి మరో డ్రాప్ నాచ్‌ 5G మొబైల్‌!  

Also Read: Happy Diwali 2023: దీపావళి రోజు లక్ష్మీ పూజలో భాగంగా తామర పువ్వులు ఎందుకు సమర్పిస్తారో తెలుసా? తప్పకుండా తెలుసుకోండి!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News