భారత్- శ్రీలంక మధ్య కోల్కతా ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న తొలిటెస్ట్ లో భారత ఇన్నింగ్స్ ముగిసింది. 59.3 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కొద్ది సమయం తరువాత శ్రీలంక బ్యాటింగ్ ప్రారంభించింది. శ్రీలంక లక్ష్యం 163 పరుగులు.
ఆరో వికెట్: మూడవరోజు ఆట ప్రారంభంలో పుజారా, సాహా క్రీజులో ఉన్నారు. భారత జట్టు స్కోర్ 79 పరుగుల వద్ద పుజారా ఔటయ్యాడు. గమగె బౌలింగ్ లో 52 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పుజారా బౌల్డ్ అయ్యాడు.
ఏడో వికెట్: జట్టు స్కోర్ 127 పరుగుల వద్ద జడేజా ఔటయ్యాడు. 22 పరుగుల వ్యక్తిగత స్కోర్ చేసిన జడేజా పెరెరా బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
ఎనిమిదో వికెట్: జట్టు స్కోర్ 128 ఉండగా.. సాహా 22 పరుగులు చేసి పెరెరా బౌలింగ్ లో మ్యాథ్యూస్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
తొమ్మిదో వికెట్: జట్టు స్కోర్ 146 ఉండగా.. భువనేశ్వర్ 13 పరుగులు చేసి లక్మల్ బౌలింగ్ లో డిక్వెలాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
కడపటి వార్తలందేసరికి శ్రీలంక బ్యాటింగ్ ప్రారంభించి రెండు వికెట్లు కోల్పోయింది. జట్టు స్కోర్ 29 పరుగుల వద్ద కరుణరత్నే 8 పరుగులు చేసి భువనేశ్వర్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ గా వెనుదిరిగాడు. జట్టు స్కోర్ 34 పరుగుల వద్ద సమరవిక్రమ 23 పరుగులు చేసి భవనేశ్వర్ బౌలింగ్లో సాహాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.