విండీస్‌ను ఫాలో ఆన్ ఎందుకు ఆడించలేదంటే ....

విండీస్ పర్యటనలో భారత జట్టు ఒకవైపు దూకుడైన ఆటతీరును ప్రదర్శిస్తూనే మరోవైపు సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది.

Last Updated : Sep 2, 2019, 07:41 PM IST
విండీస్‌ను ఫాలో ఆన్ ఎందుకు ఆడించలేదంటే ....

భారత్ తో జరగున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్ లో విండీస్ ను 117 పరుకులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్ లో 416 పరుగుల భారీ స్కోర్ చేసిన కోహ్లీ సేన.. మొత్తం 299 పరుగుల ఆధిక్యాన్ని మూటగట్టుకుంది.  ఫాలో అన్ ఛాన్స్ ఆడించే ఉన్నప్పటికీ ...విండీస్ కు ఫాలో ఆన్ ఆడించలేదు. దీనిపై విమర్శలు వస్తున్నప్పటికీ టీమిండియా కెప్టెన్ కోహ్లీ మాత్రం మనసులో మాట బయటికి చెప్పకుండా మౌనం వహిస్తున్నాడు. రెండో ఇన్నింగ్ లో విండీస్ బ్యాట్స్ మెన్లు ప్రతిఘటిస్తే భారత బౌలర్లు ఎక్కువ ఓవర్లు వేసి అలసిపోతారని అనుకున్నాడేమో.. అందుకే కోహ్లీ ఫాలో అన్ వైపు మొగ్గుచూపలేదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు

ఇదిలా ఉంటే భారత్ తన రెండో ఇన్నింగ్ లో నాలుగు వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసి ఇన్నింగ్ డిక్లేర్ట్ చేసింది. ఇలా విండీస్ ముందు 468 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. కొండత లక్ష్యంతో  బరిలోకి దిగిన విండీస్ జట్టు... మూడో రోజు చివరి సెషల్ లో మొత్తం 13.2 ఓవర్లు ఎదుర్కొని కీలకమైన రెండు వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది. విజయం సాధించాలంటే ఇంకా 423 పరుగుల సాధించాల్సి ఉంది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. ప్రస్తుత ఫాం, ఇరు జట్ల బలబలాలను బట్టి చూస్తే విండీస్ కు గెలుపుకు కానీ.. అలాగని డ్రాకు అవకాశం లేదు. ఎంత తేడాతో ఓడిపోతందనేది తేలాల్సి ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Trending News