IND Vs SA Test Series: సౌతాఫ్రికాతో జరగనున్న టెస్టు సిరీస్ లో తాము తప్పక విజయం సాధిస్తామని టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. గతంలో సౌతాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ సాధించలేకపోయిన భారత జట్టు.. ఈ సారి తప్పక గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. టెస్టు సిరీస్ గెలుపొంది.. సరికొత్త చరిత్ర సృష్టిస్తామని కోహ్లీ తెలిపాడు.
భారత జట్టు గత పర్యటనలో దక్షిణాఫ్రికా చేతిలో 2-1 తేడాతో సిరీస్ కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, వాండరర్స్ వేదికగా జరిగిన చివరి టెస్టులో టీమ్ఇండియా 63 పరుగుల తేడాతో సౌతాఫ్రికా టీమ్ పై విజయం సాధించింది. ఆ తర్వాత అక్కడే జరిగిన వన్డే సిరీస్‌ను టీమ్‌ఇండియా 5-0 తేడాతో కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది.
"గతంలో జరిగిన సౌతాఫ్రికా పర్యటనలో మేం టెస్టు సిరీస్ కోల్పోయినా.. వన్డే సిరీస్‌ను 5-0 తేడాతో గెలుచుకున్నాం. టఫ్ పిచ్‌లపై కూడా మా ఆటగాళ్లు మెరుగ్గా రాణించారు. అదే కాన్ఫిడెన్స్ తో ఈసారి ఎలాగైనా టెస్టు సిరీస్ గెలవాలనే లక్ష్యంతో ఉన్నాం. సిరీస్ ఆరంభంలోనే పైచేయి సాధిస్తే.. సిరీస్ సాధించడం కష్టమేం కాదు. సౌతాఫ్రికాలో మా జట్టు ఇప్పటి వరకు ఒక్క సిరీస్ కూడా సాధించలేదు. భారత్ లోనే కాకుండా.. విదేశాల్లో కూడా సిరీస్‌లు సాధించాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నాం. ఇటీవల మా ఆటగాళ్లు విదేశీ పిచ్‌లపై మెరుగ్గా రాణిస్తున్నారు. క్రీజులో రోజంతా కొనసాగాలంటే ఎలా ఆడాలి? అనే విషయంపై ఆటగాళ్లకు అవగాహన వచ్చింది" అని సౌతాఫ్రికా పర్యటనకు బయల్దేరే ముందు మీడియా సమావేశంలో కోహ్లీ ఈ విధంగా మాట్లాడాడు.
సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా హోమ్ టీమ్ తో టీమ్ఇండియా.. మూడు టెస్టులు, మూడు వన్డే మ్యాచులు ఆడనుంది. డిసెంబరు 26 నుంచి సెంచూరియన్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది జనవరి 19 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుందని ఇటీవలే బీసీసీఐ విడుదల చేసిన షెడ్యూల్ ద్వారా స్పష్టమైంది.
Also Read: Ravindra Jadeja Retirement: రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన రవీంద్ర జడేజా!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook