Hardik Pandya reveals reason Why taking Batting First in India vs New Zealand 3rd T20: కొత్త ఏడాదిలో టీమిండియా వరుస సిరీస్ విజయాలతో దూసుకెళుతున్న విషయం తెలిసిందే. ముందుగా శ్రీలంకపై వన్డే, టీ20 సిరీస్‌లు గెలిచిన భారత్.. న్యూజిలాండ్ కూడా వన్డే, టీ20 సిరీస్‌లు కైవసం చేసుకుంది. బుధవారం కీలకమైన మూడో టీ20 మ్యాచ్‌లో 168 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న భారత్.. న్యూజిలాండ్‌పై మూడు టీ20ల సిరీస్‌ను ఖాతాలో వేసుకుంది. శుభ్‌మన్ గిల్ (126), హార్దిక్ పాండ్యా (4/16) రాణించడంతో మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా సునాయాస విజయం అందుకుంది.
మ్యాచ్ అనంతరం టీమిండియా టీ20 తాత్కలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ... 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకోవడం గురించి ఆలోచించలేదు. అయితే పెద్ద స్టేడియంలో విజయం సాధించడం ఆనందంగా ఉంది. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డుతో పాటు ట్రోఫీని సొంతం చేసుకోవడంలో సహాయక సిబ్బంది పాత్ర ఎంతో ఉంది. మైదానం వెలుపల వారి సహకారం ఎనలేనిది. ఇలాంటి మ్యాచ్ ఆడటం నాకెంతో ఇష్టం. అభిమానులకు ధన్యవాదాలు. మైదానం చాలా బాగుంది' అని అన్నాడు.
'నేను ముందస్తు ఆలోచనలు చేయను. విజయానికి ఏమి అవసరమో వాటిని అర్థం చేసుకుంటా. ఓ కెప్టెన్‌గా నా ఆటగాళ్లకు మద్దతుగా ఉండాలని ప్రయత్నిస్తా. దూకుడుగా ఉండేందుకు చూస్తాను. సవాళ్లను స్వీకరించడం గురించి ఎప్పుడూ మాట్లాడుకుంటాం. ఇదే మైదనంలో ఐపీఎల్ ఫైనల్ ఆడాను. అప్పుడు రెండో ఇన్నింగ్స్ సమయంలో కఠిన సవాల్ ఎదురైంది. ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా చాలా సింపుల్‌గా ఆడాలని భావించాం. అందుకే తొలుత బ్యాటింగ్ చేశాం. మా వాళ్లు అద్భుతంగా ఆడారు. భవిష్యత్తులో ఇదే ప్రదర్శనను కొనసాగిస్తాం' అని హార్దిక్ పాండ్యా తెలిపాడు.
టీ20ల్లో భారత్ అతిపెద్ద విజయం సాధించింది. ఇంతకుముందు అతిపెద్ద విజయం కూడా భారత్ పేరిటే ఉంది. 2018లో 143 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై విజయం సాధించింది. తాజాగా న్యూజిలాండ్‌పై 168 తేడాతో విజయం నమోదు చేసింది. మరోవైపు న్యూజిలాండ్‌కు ఇది మూడో అత్యల్ప స్కోరు ఇది. గతంలో శ్రీలంక, బంగ్లాదేశ్ మీద 60 పరుగులే చేసింది. ఇక అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా గిల్ (126 నాటౌట్) రికార్డు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు విరాట్ కోహ్లీ (122 నాటౌట్) పేరిట ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.