India Vs Australia ICC World CUP Final 2023: ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లు ఒక లెక్క.. ఆస్ట్రేలియాతో ఫైనల్ పోరు మరో లెక్క.. ఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఓడించి టీమిండియా మూడోసారి వరల్డ్ కప్‌ను ముద్దాడాలని 140 మంది కోట్ల మంది ప్రార్థనలు చేస్తున్నారు. 2003 వరల్డ్ కప్‌లో ఫైనల్ పోరు మళ్లీ రిపీట్ కానుండంతో.. ఆ మ్యాచ్‌లో ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటున్నారు. జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన ఆ మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. రికీ పాంటింగ్ నేతృత్వంలోని ఆసీస్ 125 పరుగుల భారీ తేడాతో భారత్‌ను చిత్తు చేసి మూడో ప్రపంచ కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. అయితే ఆ ఓటమి నుంచి పుంజుకున్న భారత్.. బలమైన జట్టుగా ఎదిగింది. ఈ ప్రపంచకప్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్‌కు చేరింది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా జరిగే పోరులో ఎలాంటి తప్పులు చేయకుండా ఆసీస్‌ను మట్టికరిపించాలి.
2003 ప్రపంచకప్ ఫైనల్‌లో చేసిన తప్పులు మళ్లీ చేయకుంటే విశ్వకప్ మనదే. ఆ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఆసీస్ బ్యాట్స్‌మెన్ చెలరేగి ఆడారు. ఇప్పుడు జరిగే ఫైనల్‌లో మ్యాచ్‌లో టాస్ గెలిస్తే.. టీమిండియా మొదట బ్యాటింగ్ చేయాలి. 300పైగా టార్గెట్ విధిస్తే.. ఛేజింగ్‌లో ఆసీస్‌కు కష్టంగా మారుతుంది. ఆస్ట్రేలియాకు ప్రధాన బలం ఓపెనర్లు ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్. వీరిద్దరిని సాధ్యమైంత త్వరగా పెవిలియన్‌కు పంపిస్తే.. విజయ అవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి. ఆసీస్ మిడిల్ ఆర్డర్‌లో స్థిరత్వం లేదు.
ఫీల్డింగ్‌లో ఎలాంటి పొరపాట్లు చేయకూడదు. టీమిండియా గత రెండు మ్యాచ్‌ల్లో క్యాచ్‌లు నేలపాలు చేయడం కలవరపెడుతోంది. నెదర్లాండ్స్ మ్యాచ్‌లో పెద్ద ఎఫెక్ట్ పడలేదు గానీ.. న్యూజిలాండ్‌తో మూల్యం చెల్లించుకునే పరిస్థితి వచ్చింది. ఆస్ట్రేలియా వంటి జట్టుకు అవకాశం ఇస్తే ఇక అంతే సంగతులు. అఫ్గానిస్థాన్‌పై లైఫ్ దొరకడంతో మ్యాక్స్‌వెల్ చెలరేగి డబుల్ సెంచరీ బాది జట్టును గెలిపించాడు. సెమీ ఫైనల్‌లో దక్షిణాఫ్రికా చాలా క్యాచ్‌లు నేలపాలు చేసి ఇంటిముఖం పట్టింది. భారత్ ఫీల్డింగ్‌కు మరికొన్ని మెరుగులు దిద్దుకుని బరిలోకి దిగాలి.
కెప్టెన్ రోహిత్ శర్మ అదే దూకుడును కంటిన్యూ చేసి.. మెరుగైన ఆరంభం ఇస్తే భారత్ భారీ స్కోరు చేయడం ఖాయం. శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ భీకరఫామ్‌లో ఉండడంతో కలిసి వచ్చే అంశం. సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజాకు పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినా.. పవర్ హిట్టింగ్‌కు రెడీగా ఉన్నారు. బౌలంగ్‌లో షమీకితోడు బుమ్రా, సిరాజ్, కుల్దీప్ చెలరేగితే ప్రపంచకప్‌ను ముద్దాడడం ఖాయం. ఆల్ ద బెస్ట్ టీమిండియా.
Also Read: World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 విజేతకు రన్నర్ జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతంటే
Also Read: Poco M4 5G Price: 50MP కెమెరా Poco M4 5G మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,000లోపే పొందండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి