Ind vs SL 1st ODI: శ్రీలంకతో తొలి వన్డే, ఫెవరెట్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా

India vs SriLanka 1st ODI Live Score Updates: స్టార్ ఆటగాళ్లు అధికంగా ఉండటంతో రెండు జాతీయ జట్లుగా భారత్ క్రికెట్ నియంత్రణ మండలి రెండు పర్యటనలకు టీమిండియా ఆటగాళ్లను పంపించింది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని జట్టు ఇంగ్లాండ్ జట్టుతో వారి గడ్డమీద టెస్ట్ సిరీస్ ఆడనుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 18, 2021, 11:12 AM IST
Ind vs SL 1st ODI: శ్రీలంకతో తొలి వన్డే, ఫెవరెట్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా

India vs SriLanka 1st ODI Live Score Updates: టీమిండియాలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. స్టార్ ఆటగాళ్లు అధికంగా ఉండటంతో రెండు జాతీయ జట్లుగా భారత్ క్రికెట్ నియంత్రణ మండలి రెండు పర్యటనలకు టీమిండియా ఆటగాళ్లను పంపించింది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని జట్టు ఇంగ్లాండ్ జట్టుతో వారి గడ్డమీద టెస్ట్ సిరీస్ ఆడనుంది.

శిఖర్ ధావన్ కెప్టెన్సీలో మరో జట్టు శ్రీలంక పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. నేటి నుంచి ఈ టీమిండియా(Team India)కు, లంక జట్టుకు మద్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. నేడు తొలి వన్డేకు కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా మారనుంది. మధ్యాహ్నం 2:30 గంటలకు టాస్, 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. భువనేశ్వర్ కుమార్, కుల్దీప్‌ యాదవ్, చహల్, హార్దిక్‌ పాండ్యా తుది జట్టులో చోటు దక్కించునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సూర్యకుమార్ యాదవ్ వన్డేల్లో టీమిండియా తరఫున అరంగేట్రం చేయబోతున్నాడు. సంజూ శాంసన్ కంటే యువ ఆటగాడు ఇషాన్ కిషన్‌కే తుది జట్టులో చోటు దక్కే అవకాశం అధికంగా ఉంది. పాండ్యా ఆల్ రౌండర్‌గా ఏ మేరకు రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

Also Read: Covid-19: రిషబ్ పంత్‌కు అండగా నిలిచిన బీసీసీఐ అధ్యక్షుడు Sourav Ganguly

సోనీ లైవ్, సోనీ టెన్2 మరియు సోనీ టెన్ 2 హెచ్‌డీ ఛానల్స్‌లో శ్రీలంక, భారత్‌ల మధ్య జరగనున్న తొలి వన్డేను వీక్షించవచ్చు. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రేమదాస స్టేడియంలో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. టీమిండియా ఫెవరేట్‌గా బరిలోకి దిగుతుండగా, శ్రీలంక జట్టు కాంట్రాక్టు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. కేవలం 4ఏళ్ల వ్యవధిలో 9 కెప్టెన్లు మారగా, దసున్‌ షనక 10వ కెప్టెన్. సీనియర్ క్రికెటర్లు కుశాల్‌ పెరీరా గాయంతో దూరం కాగా, మాథ్యూస్‌ వ్యక్తిగత కారణాలతో జట్టులో లేడు. అనుభవం లేని లంక యువ ఆటగాళ్లు పటిష్ట టీమిండియా (SL vs IND 2021)ను ఏ మేరకు ఎదుర్కుంటారని లంక బోర్డు సైతం కొంత ఆలోచనలో పడినట్లు కనిపిస్తోంది.

Also Read: Also Read: T20 World Cup 2021: Shikhar Dhawan కంటే రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌కే ఎక్కువ ఛాన్స్

తమ వద్ద మొత్తం ఆరుగురు స్పిన్నర్లు ఉన్నారని, అయితే మూడు వన్డేల్లో కలిపి ప్రతి స్పిన్నర్‌కు అవకాశం లభిస్తుందని చెప్పలేమని టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ పేర్కొన్నాడు. ఎవరు ఎన్ని మ్యాచ్‌లాడారు అనే విషయం ఆలోచించడం, అత్యుత్తమ ఆటగాళ్లతో జట్టుగా బరిలోకి దిగనున్నట్లు తెలిపాడు. లెగ్ స్పిన్నర్లు చాహల్, రాహుల్ చహర్, వరుణ్ చక్రవర్తి ఉండగా, ఆఫ్ స్పిన్నర్లు గౌతమ్ క్రిష్ణప్ప, లెఫ్టార్మ్ స్పిన్నర్లు కృ పాండ్యా, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఉన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News