India vs Zimbabwe Playing 11, Dinesh Karthik out and Rishabh Pant in: ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2022 సూపర్ 12లో భారత్ జట్టు మరో సమరానికి సిద్ధమైంది. మరికాసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్‌లో జింబాబ్వేను భారత్ ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ స్థానంలో రిషబ్ పంత్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు జింబాబ్వే రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది.
బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందిన పాకిస్థాన్.. టీ20 ప్రపంచకప్ 2022 సెమీస్‌కు చేరుకుంది. అనూహ్య పరిస్థితుల నడుమ పాక్ వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్‌కు చేరింది. అంతకుముందు పసికూన నెదర్లాండ్స్ చేతిలో పటిష్ట దక్షిణాఫ్రికా చిత్తుగా ఓడటంతో.. జింబాబ్వేతో జరిగే మ్యాచ్‌లో గెలవాల్సిన అవసరం లేకుండానే భారత్ సెమీస్‌కు చేరింది. ఈ మ్యాచ్ గెలిస్తే రోహిత్ సేన గ్రూప్ 2 నుంచి అగ్రస్థానంలో నిలుస్తుంది.
Toss update from Melbourne 🏟
India have opted to bat against Zimbabwe in the final Super 12 clash 🏏#T20WorldCup | #ZIMvIND |📝: https://t.co/SFsHINI2PL pic.twitter.com/E7Sf2EsslJ
— ICC (@ICC) November 6, 2022
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.
జింబాబ్వే: వెస్లే మధెవెరె, క్రెయిగ్ ఇర్విన్ (కెప్టెన్), రెగిస్ చకబ్వా, సీన్ విలియమ్స్, సికిందర్ రజా, టోనీ మున్యోంగ, రియాన్ బర్ల్, టెండై చతార, రిచర్డ్ ఎన్‌గరవ, వెల్లింగ్టన్ మసకద్జ, బ్లెసింగ్‌ముజరబని.
🚨 Toss & Team Update 🚨@ImRo45 has won the toss & #TeamIndia have elected to bat against Zimbabwe in Melbourne. #T20WorldCup | #INDvZIM
Follow the match 👉 https://t.co/shiBY8Kmge
1⃣ change to our Playing XI as @RishabhPant17 is named in the team 🔽 pic.twitter.com/J8gFfFv4cv
— BCCI (@BCCI) November 6, 2022
Also Read: Virat Kohli: ఆ లక్షణాలే.. విరాట్ కోహ్లీ సక్సెస్‌కు కారణం: శిఖర్ ధావన్
Also Read: మ్యాచ్ టర్నింగ్ పాయింట్.. దక్షిణాఫ్రికాను ముంచిన వాన్ డెర్ మెర్వ్ (వీడియో)!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి