అంబటి రాయుడు సత్తా చాటాడు.. చెన్నైకి విజయాన్ని అందించాడు

అంబటి రాయుడు మళ్లీ తన ప్రతాపం చూపాడు. ఐపీఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయుడు (100 నాటౌట్‌; 62 బంతుల్లో 7×4, 7×6) తన ప్రతాపాన్ని చూపించడంతో  చెన్నై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Last Updated : May 14, 2018, 02:02 PM IST
అంబటి రాయుడు సత్తా చాటాడు.. చెన్నైకి విజయాన్ని అందించాడు

అంబటి రాయుడు మళ్లీ తన ప్రతాపం చూపాడు. ఐపీఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయుడు (100 నాటౌట్‌; 62 బంతుల్లో 7×4, 7×6) తన ప్రతాపాన్ని చూపించడంతో  చెన్నై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.  షేన్‌ వాట్సన్‌ (57; 35బంతుల్లో 5×4, 3×6) కూడా తన అర్థ సెంచరీతో చెన్నైకి సహకారం అందివ్వడంతో ఇంకా ఆరు బంతులు మిగిలి ఉండగానే జట్టు విజయతీరాన్ని చేరుకుంది.

అలాగే ఇదే విజయంతో జట్టు ప్లే ఆఫ్‌కి కూడా చేరుకుంది. ఒక రకంగా చెప్పాలంటే రాయుడు ఈ సీజన్లో పలుమార్లు తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. సన్‌రైజర్స్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లోనూ తన ప్రతాపం చూపాడు. ముఖ్యంగా ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో రాయుడు పూర్తిస్థాయిలో రాణించాడు. వాట్సన్‌ రనౌట్‌ అయినా.. అభిమానులను నిరుత్సాహపరచలేదు.

ధోనీ( 20నాటౌట్‌; 14బంతుల్లో 1×4,1×6)తో కలిసి మ్యాచ్ గెలుపు పథాన పయనించడానికి రాయుడు దోహదపడ్డాడు. ఇంకా చెప్పాలంటే.. రాయుడు బ్యాటింగ్ ముందు సన్‌రైజర్స్‌ బౌలర్లు తేలిపోయారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఇచ్చిన 180 పరుగుల టార్గెట్ కొట్టడానికి బరిలోకి దిగిన చెన్నై సూపర్‌కింగ్స్‌ చేసిన ఈ రోజు ఇన్నింగ్స్‌లో రాయుడే సూపర్ హీరో.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై జట్టు, సన్‌రైజర్స్‌ని బాగానే కట్టడి చేసింది. ఆ జట్టులో శిఖర్ ధావన్ (79), కేన్ విలియమ్సన్ (51) మిగతా ఎవరూ పెద్దగా రాణించలేదు. కానీ, తర్వాత బ్యాటింగ్ చేయడానికి వచ్చిన చెన్నై జట్టుకి రాయుడే మొత్తం మ్యాచ్ భుజాన వేసుకొని నడిపించాడు. 

More Stories

Trending News