RR vs PBKS: పంజాబ్ కింగ్స్ లెవెన్‌పై రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో విజయం

RR vs PBKS: ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్ జట్టు మరో విజయం నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ జట్టు..6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 7, 2022, 07:36 PM IST
  • పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో విజయం
  • టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన పంజాబ్, 189 పరుగుల భారీ స్కోరు
  • 4 వికెట్లు కోల్పోయి..మరో 2 బంతులు మిగిలుండగా విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్
  RR vs PBKS: పంజాబ్ కింగ్స్ లెవెన్‌పై రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో విజయం

RR vs PBKS: ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్ జట్టు మరో విజయం నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ జట్టు..6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఐపీఎల్ 2022లో 52 వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య రసవత్తరంగా సాగుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ లెవెన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగుల భారీ స్కోరు చేసింది. పంజాబ్ కింగ్స్ తరపున బెయిర్ స్టో 40 బంతుల్లో 56 పరుగులు, జితేష్ శర్మ 18 బంతుల్లో 38 పరుగులు చేయడంతో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు చేయగలిగింది. అటు రాజపక్సే కూడా 18 బంతుల్లో 27 పరుగులు ధాటిగానే ఆడాడు. కెప్టెన్ మయాంక్ మరోసారి విఫలమయ్యాడు. పంజాబ్ వికెట్లు పడుతున్నా ధాటిగా ఆడటంతో 189 పరుగులు చేయగలిగింది. రాజస్థాన్ బౌలర్ యజువేంద్ర చహల్ మరోసారి పంజాబ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. 

ఇక 190 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్ రాయల్స్ ప్రారంభం నుంచి చెలరేగి ఆడుతోంది. 3 ఓవర్లకే 25 పరుగులు చేసింది. జోస్ బట్లర్‌ను పంజాబ్ కింగ్స్ త్వరగానే అవుట్ చేయగలిగింది. 16 బంతుల్లో 30 పరుగులతో ధాటిగా ఆడుతున్న బట్లర్‌ను రబాడా ఔట్ చేశాడు. ఆ తరువాత కెప్టెన్ సంజూ శామ్సన్ 12 బంతుల్లో 23 పరుగులు చేసి అవుటయ్యాడు. ఇక అప్పట్నించి జైశ్వాల్ ధాటిగా చెలరేగి ఆడుతుండటంతో రాజస్థాన్ రాయల్స్‌కు కలిసొచ్చింది. 14 ఓవర్లు ముగిసేసరికి కేవలం 2 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. 15వ ఓవర్లో జైశ్వాల్ 41 బంతుల్లో 68 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ తరువాత బరిలో దిగిన హెట్‌మెయిర్ సైతం ధాటిగా ఆడటంతో 12 బంతులకు 11 పరుగులకు చేరుకుంది. 19వ ఓవర్లో మరో విజయానికి మరో 8 పరుగులు కావల్సి ఉండగా..పడిక్కల్ అవుటయ్యాడు. ఆ తరువాత హెట్ మెయిర్ చివరి ఓవర్ మొదటి బంతికి సిక్స్ కొట్టడంతో విజయం సులభమైంది. మరో రెండు బంతులు మిగిలుండగా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Also read: IPL 2022 Play Off Chances: మారుతున్న ఐపీఎల్ సమీకరణాలు.. ఎవరెవరికి ప్లే ఆఫ్ అవకాశాలు.. ??

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News