IPL 2022: ఐపీఎల్ 2022లో టాప్ ప్లేయర్స్ వీళ్లే.. చెత్త రికార్డులు ఇవే!

IPL 2022: ఐపీఎల్ 15వ సీజన్ లో మొత్తం 74 మ్యాచ్ లు జరిగాయి. ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. చెత్త రికార్డులు వచ్చాయి. ఆటగాళ్లు వ్యక్తిగతంగా పలు మైలురాళ్లు అందుకున్నారు. మరికొందరు చెత్త రికార్డులను తమ పేర్ల మీద లిఖించుకున్నారు. ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ స్టార్  ఓపెనర్ జాస్ బట్లర్ ఎక్కువ రికార్డులు సాధించాడు

Written by - Srisailam | Last Updated : May 30, 2022, 08:41 AM IST
  • ఐపీఎల్ 2022 విజేత గుజరాత్ టైటాన్స్
  • ఆరెంజ్ క్యాప్ జోస్ బట్లర్
  • పర్పుల్ క్యాప్ యుజ్వేంద్ర చాహల్
IPL 2022: ఐపీఎల్ 2022లో టాప్ ప్లేయర్స్ వీళ్లే.. చెత్త రికార్డులు ఇవే!

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ ముగిసింది. ఐపీఎల్ టైటిల్ కోసం 10 జట్ల మధ్య రెండు నెలల పాటు హోరాహోరీగా పోరు జరిగింది. తొలిసారి ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ అద్భుత ఆటతీరు ప్రదర్శించింది. అరంగ్రేటంతోనే ఐపీఎల్ కప్ ను కైవసం చేసుకుంది. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్ పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది హార్టిక్ పటేల్ సేన. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ నుంచి  దుమ్ము రేపారు గుజరాత్ టైటాన్స్.లీగ్ దశలో 14 మ్యాచ్ లు ఆడిన గుజరాత్.. 10 విజయాలతో టాప్ ప్లేస్ లో నిలిచి ప్లేఆఫ్స్ చేరింది. ప్లే ఆఫ్స్ లో రాజస్థాన్ రాయల్స్ ను ఓడించి ఫైనల్ చేరింది. గమ్మత్తుగా ఫైనల్ లోనూ టైటాన్స్ కు ప్రత్యర్థిగా మళ్లీ రాజస్థాన్ రాయల్సే వచ్చారు. ఫైనల్ పోరులోనూ సొంత గ్రౌండ్ లో సంజూ శాంసన్ సేనను మట్టి కరిపించి కప్ గెలుచుకుంది గుజరాత్ టైటాన్స్.  

ఐపీఎల్ 15వ సీజన్ లో మొత్తం 74 మ్యాచ్ లు జరిగాయి. ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. చెత్త రికార్డులు వచ్చాయి. ఆటగాళ్లు వ్యక్తిగతంగా పలు మైలురాళ్లు అందుకున్నారు. మరికొందరు చెత్త రికార్డులను తమ పేర్ల మీద లిఖించుకున్నారు. ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ స్టార్  ఓపెనర్ జాస్ బట్లర్ ఎక్కువ రికార్డులు సాధించాడు. ఐపీఎల్ లో  ఆటగాళ్ల వ్యక్తిగత టాప్, పూర్  రికార్డులు చూద్దాం..

ఆరెంజ్ క్యాప్-  జోస్ బట్లర్( రాజస్థాన్ రాయల్స్ ) 863 పరుగులు  

పర్పుల్ క్యాప్ - యుజ్వేంద్ర చాహల్( రాజస్థాన్ రాయల్స్ ) 17 మ్యాచుల్లో 27 వికెట్లు  

అత్యధిక సెంచరీలు-  రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ 4  

అత్యధిక స్కోర్-  క్వింటన్ డి కాక్ (లక్నో సూపర్ జెయింట్స్ ) 140  

ఫాస్ట్ సెంచరీ- రాయల్ ఛాలెంజర్స్  రజత్ పాటిదార్ 49 బంతుల్లో వంద

ఎక్కువ హాఫ్ సెంచరీలు-  ఢిల్లీ క్యాపిటల్స్ డేవిడ్ వార్నర్  5

అత్యధిక సిక్సర్లు-  జోస్ బట్లర్(రాజస్థాన్ రాయల్స్ )  83 ఫోర్లు

అత్యధిక ఫోర్లు-  జోస్ బట్లర్(రాజస్థాన్ రాయల్స్ ) 45 సిక్సర్లు  

డాట్ బాల్స్-  రాజస్థాన్ రాయల్స్‌ పేసర్  ప్రసిద్ధ్ కృష్ణ 200 డాట్ బాల్స్

బౌలర్ సగటు-  లక్నో సూపర్ జెయింట్స్‌ మొహ్సిన్ ఖాన్ (14.07)

పూర్ బౌలర్-  బెంగళూరు బౌలర్ జోస్ హేజిల్‌వుడ్ పంజాబ్ పై 4 ఓవర్లలో 64 పరుగులు

అత్యుత్తమ ప్రదర్శన-   ముంబై ఇండియన్స్‌ జస్ప్రీత్ బుమ్రా 10 పరుగులకు 5 వికెట్లు(కేకేఆర్‌పై)

బౌలింగ్ లో ఉత్తమ స్ట్రైక్ రేట్- ఆండ్రీ రస్సెల్( కోల్ కతా నైట్ రెడర్స్ ) 9.94 స్ట్రైక్ రేట్‌

ఉత్తమ ఎకానమీ-  స్పిన్నర్ సునీల్ నరైన్ (కోల్‌కతా నైట్ రైడర్స్) 5.57 

READ ALSO: Nepal Plane Crash: జీపీఎస్‌ ఆధారంగా క్రాష్‌ అయిన నేపాల్‌ విమానం ఆచూకీ గుర్తింపు..!

READ ALSO: Sidhu Moose Wala Murder: సిద్ధూపై ఏకె 94 రైఫిల్స్‌తో 30 రౌండ్ల కాల్పులు... సింగర్ చావును ముందే ఊహించాడా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News