Shubman Gill Catch: పరుగెత్తుకుంటూ వెళ్లి గాల్లో దూకి.. స్టన్నింగ్ క్యాచ్ పట్టిన శుభ్‌మాన్‌ గిల్! చూస్తే షాక్ అవ్వాల్సిందే!

GT vs LSG, Shubman Gill Catch. ఓపెనర్ శుభ్‌మాన్‌ గిల్ స్టన్నింగ్ క్యాచ్ పట్టి ఔరా అనిపించాడు. ఫ్లడ్ లైట్స్ వెలుతురులో ముందుకు పరుగెడుతూ.. ఫుల్‌ డైవ్‌తో గిల్ పట్టిన క్యాచ్ ఐపీఎల్ లీగ్‌లోనే ఓ హైలైట్‌గా నిలిచింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 28, 2022, 09:05 PM IST
  • స్టన్నింగ్ క్యాచ్ పట్టిన శుభ్‌మాన్‌ గిల్
  • గిల్ క్యాచ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే
  • లీగ్‌లోనే ఓ హైలైట్‌
Shubman Gill Catch: పరుగెత్తుకుంటూ వెళ్లి గాల్లో దూకి.. స్టన్నింగ్ క్యాచ్ పట్టిన శుభ్‌మాన్‌ గిల్! చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Shubman Gill Takes a Running Stunner catch to Dismiss Evin Lewis: ఐపీఎల్ 2022లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో రెండు కొత్త జట్లు లక్నో సూపర్ జెయింట్స్‌, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచులో గుజరాత్ ప్లేయర్స్ అదరగొడుతున్నారు. ఇప్పటికే పేసర్ మొహ్మద్ షమీ మూడు వికెట్లతో మెరవగా.. ఓపెనర్ శుభ్‌మాన్‌ గిల్ స్టన్నింగ్ క్యాచ్ పట్టి ఔరా అనిపించాడు. ఫ్లడ్ లైట్స్ వెలుతురులో ముందుకు పరుగెడుతూ.. ఫుల్‌ డైవ్‌తో గిల్ పట్టిన క్యాచ్ ఐపీఎల్ లీగ్‌లోనే ఓ హైలైట్‌గా నిలిచింది. 

గుజరాత్ టైటాన్స్ పేసర్ వరుణ్ ఆరోన్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌ మూడో బంతిని బౌన్సర్‌గా సాధించగా.. స్టార్ బ్యాటర్ ఎవిన్ లూయిస్ భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అయితే బంతి ఎడ్జ్ తీసుకొని స్క్వేర్ లెగ్ దిశగా గాల్లో లేచింది. పవర్ ప్లే కావడంతో సర్కిల్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శుభ్‌మన్ గిల్.. క్యాచ్ అందుకునేందుకు ముందుకు పరుగెత్తాడు. ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి డైవ్‌ చేస్తూ బంతిని అందుకున్నాడు. ఇంకేముందు లూయిస్ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. ఇక గిల్ ఫీల్డింగ్ విన్యాసానికి మైదానంలోని ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. 

శుభ్‌మన్ గిల్ పట్టిన క్యాచుకు సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. 'క్యాచ్ ఆఫ్ ద టోర్నమెంట్‌' అని ఓ అభిమాని వీడియోను పోస్ట్ చేశాడు. ఈ క్యాచ్ చూసిన ఫాన్స్ షాక్ అవుతున్నారు. అంతేకాదు లైకుల, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'స్టన్నింగ్ క్యాచ్', 'సూపర్ క్యాచ్', 'శుభ్‌మాన్‌.. వాట్ ఏ క్యాచ్' అంటూ కెమెంట్లు చేస్తున్నారు. శుభ్‌మాన్‌ మంచి బ్యాటర్ మాత్రమే కాకుండా.. మంచి ఫీల్డర్ అన్న విషయం తెలిసందే. గత సీజన్ వరకు కోల్‌కతా తరఫున ఆడిన గిల్. ఈసారి గుజరాత్ తరఫున బరిలోకి దిగాడు. 

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో జట్టు మొహ్మద్ షమీ ధాటికి 29 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ మొదటి బంతికే కెప్టెన్ కేఎల్ రాహుల్ (0) గోల్డెన్ డక్‌ అవ్వగా.. క్వింటన్ డికాక్ (7), ఎవిన్ లూయిస్ (10), మనీశ్ పాండే (6) విఫలమయ్యారు. అయితే దీపక్ హుడా పరుగుల వరద పారిస్తూ మెరుపు హాఫ్ సెంచరీ చేసి జట్టును ఆదుకున్నాడు. ప్రస్తుతం లక్నో 15 ఓవర్లలో 4 వికెట్లకు 109 రన్స్ చేసింది. 

Also Read: Radhe Shyam OTT: 'రాధేశ్యామ్‌' ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది.. అమెజాన్‌ ప్రైం వీడియోస్‌లో స్ట్రీమింగ్‌!

Also Read: GT vs LSG: ఐపీఎల్‌లో తొలిసారి బరిలోకి గుజరాత్, లక్నో.. ఇరు జట్లలో గేమ్ ఛేంజర్స్‌ వీరే! ఇక డబిడదిబిడే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News