IPL Auction 2023: ముగిసిన ఐపీఎల్ వేలం.. ఏ టీమ్ ఏ ఆటగాడిని ఎంతకు కొనుగోలు చేసింది..? పూర్తి వివరాలు ఇవే..

IPL Mini Auction List Of Players Sold: ఊహించినట్లే ఐపీఎల్ వేలం హోరాహోరీగా సాగింది. స్టార్ ఆటగాళ్లను దక్కించుకునేందుకు ఐపీఎల్ టీమ్స్ కోట్లు ఖర్చు చేశాయి. ఏ టీమ్ ఎవరిని తీసుకుంది..? ఎంత ఖర్చు చేసింది..? జట్ల వారీగా పూర్తి వివరాలు ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 24, 2022, 07:41 AM IST
IPL Auction 2023: ముగిసిన ఐపీఎల్ వేలం.. ఏ టీమ్ ఏ ఆటగాడిని ఎంతకు కొనుగోలు చేసింది..? పూర్తి వివరాలు ఇవే..

IPL Mini Auction List Of Players Sold:  క్రికెట్ అభిమానులు ఎంతోగానో ఎదురుచూసిన ఐపీఎల్ మినీ వేలం ముగిసిది. ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు కనక వర్షం కురిపించాయి. కొందరు ప్లేయర్లు రాత్రికే రాత్రే కోటీశ్వరులుగా మారిపోయారు. ఆరు గంటలకు పైగా సాగిన ఈ వేలంలో పలు పాత రికార్డులు బద్దలయి కొత్త రికార్డులు క్రియేట్ అయ్యాయి. ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా శామ్ కర్రన్ నిలిచాడు. స్టార్ ఆటగాళ్లు కూడా స్థాయితగ్గ రేటుకు వేలంలో అమ్ముడుపోయారు. ముగ్గురు ఆటగాళ్లు 16 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని అందుకున్నారు. మొత్తంగా నలుగురు ఆటగాళ్లు 13 కోట్లకు పైగా అందుకున్నారు. ఏ జట్లు ఏ ఆటగాళ్లను కొనుగోలు చేశాయో పూర్తి వివరాలు ఇలా..

చెన్నై సూపర్ కింగ్స్- బెన్ స్టోక్స్ (16.25 కోట్లు), అజింక్యా రహానే (50 లక్షలు), భగత్ వర్మ (20 లక్షలు), అజయ్ జాదవ్ మండల్ (20 లక్షలు), కైల్ జేమీసన్ (కోటి), నిశాంత్ సింధు (60 లక్షలు), షేక్ రషీద్ (20 లక్షలు).

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- విల్ జాక్వెస్ (3.2 కోట్లు), సోనూ యాదవ్ (20 లక్షలు), అవినాష్ సింగ్ (60 లక్షలు), రాజన్ కుమార్ (70 లక్షలు), మనోజ్ భాండాగే (20 లక్షలు), హిమాన్షు శర్మ (20 లక్షలు), రీస్ టాప్లీ (1.9 లక్షలు).

ఢిల్లీ క్యాపిటల్స్- ముఖేష్ కుమార్ (5.5 కోట్లు), రిలే రోసోవ్ (4.6 కోట్లు), మనీష్ పాండే (2.4 కోట్లు), ఇషాంత్ శర్మ (50 లక్షలు), ఫిలిప్ సాల్ట్ (2 కోట్లు).

ముంబై ఇండియన్స్- కామెరూన్ గ్రీన్ (17.5 కోట్లు), నేహాల్ వధేరా (20 లక్షలు), షామ్స్ ములానీ (20 లక్షలు), విష్ణు వినోద్ (20 లక్షలు), డ్వేన్ జెన్సన్ (20 లక్షలు), పీయూష్ చావ్లా (50 లక్షలు), జై రిచర్డ్‌సన్ (1.5 కోట్లు), రాఘవ్ గోయల్ (20 లక్షలు).

కోల్‌కతా నైట్ రైడర్స్ - షకీబ్ అల్ హసన్ (1.5 కోట్లు), మన్‌దీప్ సింగ్ (50 లక్షలు), లిటన్ దాస్ (50 లక్షలు), కుల్వంత్ ఖేల్రౌలియా (20 లక్షలు), డేవిడ్ విజే (ఒక కోటి), సుయాష్ శర్మ (20 లక్షలు), నారాయణ్ జగదీషన్ (90 లక్షలు), వైభవ్ అరోరా (60) లక్షలు) లక్ష).

రాజస్థాన్ రాయల్స్ - జేసన్ హోల్డర్ (5.75 కోట్లు), ఆకాష్ వశిష్ట్ (20 లక్షలు), మురుగన్ అశ్విన్ (20 లక్షలు), కేఎమ్ ఆసిఫ్ (30 లక్షలు), ఆడమ్ జంపా (1.5 కోట్లు), కునాల్ సింగ్ రాథోర్ (20 లక్షలు), డోనావన్ ఫెరీరా (50 లక్షలు), జో రూట్ (ఒక కోటి), అబ్దుల్ బాసిత్ (20 లక్షలు).

పంజాబ్ కింగ్స్ - శామ్ కర్రాన్ (18.5 కోట్లు), శివమ్ సింగ్ (20 లక్షలు), మోహిత్ రాఠీ (20 లక్షలు), విద్వాత్ కవేరప్ప (20 లక్షలు), హర్‌ప్రీత్ సింగ్ భాటియా (40 లక్షలు), సికందర్ రజా (50 లక్షలు). 

సన్‌రైజర్స్ హైదరాబాద్- హ్యారీ బ్రూక్ (13.25 కోట్లు), మయాంక్ అగర్వాల్ (8.25 కోట్లు), హెన్రిచ్ క్లాసెన్ (5.25 కోట్లు), ఆదిల్ రషీద్ (2 కోట్లు), అకిల్ హొస్సేన్ (ఒక కోటి), అన్మోల్‌ప్రీత్ సింగ్ (20 లక్షలు), నితీష్ రెడ్డి (20 లక్షలు), మయాంక్ దాగర్ (1.8 కోట్లు), ఉపేంద్ర యాదవ్ (25 లక్షలు), సన్వీర్ సింగ్ (20 లక్షలు), సమర్థ్ వ్యాస్ (20 లక్షలు), వివ్రాంత్ శర్మ (2.6 కోట్లు), మయాంక్ మార్కండే (50 లక్షలు).

లక్నో సూపర్ జెయింట్స్- నికోలస్ పూరన్ (16 కోట్లు), యుధ్వీర్ సింగ్ చరక్ (20 లక్షలు), నవీన్ ఉల్ హక్ (50 లక్షలు), స్వప్నిల్ సింగ్ (20 లక్షలు), ప్రేరక్ మన్కడ్ (20 లక్షలు), అమిత్ మిశ్రా (50 లక్షలు), డేనియల్ సైమ్స్ (75 లక్షలు), రొమారియో షెపర్డ్ (50 లక్షలు), యశ్ ఠాకూర్ (45 లక్షలు), జయదేవ్ ఉనద్కత్ (50 లక్షలు).

గుజరాత్ టైటాన్స్- శివమ్ మావి (6 కోట్లు), శ్రీకర్ భరత్ (1.2 కోట్లు), కేన్ విలియమ్సన్ (2 కోట్లు), మోహిత్ శర్మ (50 లక్షలు), జాషువా లిటిల్ (4.4 కోట్లు), ఉర్విల్ పటేల్ (20 లక్షలు), ఒడియన్ స్మిత్ (50 లక్షలు). 

Also Read: IPL Mini Auction: సెహ్వాగ్ మేనల్లుడుపై కాసుల వర్షం.. వేలంలో దక్కించుకున్న సన్‌రైజర్స్  

Also Read: IPL 2023 Auction: ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన టాప్-5 ఆటగాళ్లు వీళ్లే.. టీమిండియా నుంచి ఒక్కడే

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News