IPL RCB vs MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో నేడు డబుల్ హెడ్డర్ మ్యాచులు జరగనున్నాయి. తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరబాద్, చెన్నై సూపర్ కింగ్స్ ఆడనుండగా.. రెండో మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబయి ఇండియన్స్ తలపడనుంది. ఈ సీజన్ లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచుల్లో ఒక్క విజయాన్ని అందుకోలేకపోయిన ముంబయి ఇండియన్స్ ఈ మ్యాచ్ లో కచ్చితంగా విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. మరోవైపు రెండు విజయాలతో దూసుకుపోతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకాలని చూస్తోంది. ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ శనివారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.
తొలి గెలుపు వేటలో రోహిత్ సేన..
ఐపీఎల్ చరిత్రలో ఐదు సార్లు విజేతగా నిలిచిన ముంబయి ఇండియన్స్ ఈ సీజన్ ప్రారంభం నుంచి తడబడుతుంది. ఆడిన మూడు మ్యాచ్ ల్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోవడం గమనార్హం. అయితే శనివారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగనున్న మ్యాచ్ ఎంతో కీలకంగా మారనుంది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా నెగ్గి.. ఈ సీజన్ లో తొలి విజయాన్ని నమోదు చేసుకోవాలని పట్టుదలతో ఉంది.
ఆర్సీబీ జోరును కొనసాగిస్తుందా?
ఫాప్ డుప్లెసిస్ కెప్టెన్సీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ అద్భుతంగా రాణిస్తుంది. ఈ సీజన్ లో ఆడిన మూడు మ్యాచ్ ల్లో రెండు విజయాలను నమోదు చేసుకుంది. అయితే టాప్ ఆర్డర్ లో ఫాప్ డుప్లెసిస్ మినహా విరాట్ కోహ్లీ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ముంబయి ఇండియన్స్ తో జరగనున్న మ్యాచ్ లో గ్లెన్ మ్యాక్స్ వెల్ ఆడే అవకాశం ఉంది. మరోవైపు మిడల్ ఆర్డర్ లో దినేష్ కార్తిక్ ఫామ్ లోకి రావడం ఆర్సీబీకి కలిసొచ్చే అంశం.
ఇరుజట్ల గెలుపోటములు
ఐపీఎల్ చరిత్రలో ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు 31 సార్లు తలపడ్డాయి. అందులో ముంబయి 19 సార్లు నెగ్గగా.. ఆర్సీబీ 12 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. ప్రస్తుత సీజన్ లో మాత్రం ఆర్సీబీ మరింత దూకుడుగా కనిపిస్తోంది. అయితే ఈ మ్యాచ్ లో గెలుపెవరిదో తెలుసుకోవాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.
తుది జట్లు (అంచనా):
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
ఫాప్ డుప్లెసిస్ (కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తిక్ (వికెట్ కీపర్), గ్లెన్ మ్యాక్స్ వెల్, షాబజ్ అహ్మద్, వానిందు హసరంగ, డేవిడ్ విల్లే, హర్షల్ పట్లే, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్.
ముంబయి ఇండియన్స్:
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, కిరన్ పొలార్డ్, డానియల్ సామ్స్, డీవాల్డ్ బ్రేవిస్, మురగన్ అశ్విన్, జస్ప్రిత్ బుమ్రా, తైమల్ మిల్స్, బాసిల్ తంపి.
Also Read: CSK vs SRH vs MI: సీఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎంఐ..తొలి విజయం ఎవరిది
Also Read: PBKS vs GT: 2 బంతులు..12 పరుగులు, రెచ్చిపోయిన తెవాతియా, గుజరాత్ టైటాన్స్ హ్యాట్రిక్ విజయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook