GT vs CSK: అంబటి రాయుడిని క్లీన్‌బౌల్డ్ చేసిన ఆ బౌలర్ ఎవరు..? ఈ ప్లేయర్‌కు అంత డిమాండ్ ఎందుకంటే..!

GT vs CSK Highlights: ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన తొలి ఐర్లాంట్ ప్లేయర్‌గా జాషువా లిటిల్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో కాస్త ఎక్కువగా పరుగులు ఇచ్చినా.. అంబటి రాయుడుని క్లీన్‌బౌల్డ్ చేసిన విధానం అందరినీ ఆకట్టుకుంది. గతేడాది జరిగిన మినీ వేలంలో జాషువా లిటిల్‌ను గుజరాత్ టైటాన్స్ 4.4 కోట్ల ధరకు కొనుగోలు చేసింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 1, 2023, 11:58 AM IST
GT vs CSK: అంబటి రాయుడిని క్లీన్‌బౌల్డ్ చేసిన ఆ బౌలర్ ఎవరు..? ఈ ప్లేయర్‌కు అంత డిమాండ్ ఎందుకంటే..!

Joshua Little Vs CSK: అందరూ అంచనా వేసినట్లే ఐపీఎల్‌ ప్రారంభం నుంచే ఉత్కంఠభరిత మ్యాచ్‌లు మొదలయ్యాయి. శుక్రవారం గుజరాత్, చెన్నై జట్ల మధ్య చివరి వరకు టఫ్ వార్ నడిచింది. ఆఖర్లో రషీద్ ఖాన్, తైవాటియా మెరుపులు మెరిపించడంతో గుజరాత్ జట్టు గెలుపు సొంతం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్‌ ద్వారా ఐర్లాండ్ ఫాస్ట్ బౌలర్ జాషువా లిటిల్  ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. ఐపీఎల్‌లో ఆడిన తొలి ఐరిష్ ప్లేయర్‌గా లిటిల్ నిలిచాడు. డిసెంబర్‌లో జరిగిన మినీ వేలంలో జాషువా లిటిల్‌ను గుజరాత్ టైటాన్స్ 4.4 కోట్ల ధరకు కొనుగోలు చేసింది. అరంగేట్రం మ్యాచ్‌లోనే చెన్నై స్టార్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడి క్లీన్‌బౌల్డ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.
 
గతడేది జరిగిన మినీ వేలంలోకి జాషువా లిటిల్ బేస్ ధర రూ.50 లక్షలు. వేలంగా భారీ పోటీ నెలకొనగా.. చిరవకు గుజరాత్ టైటాన్స్  రూ.4.4 కోట్ల మొత్తాన్ని చెల్లించి తమ జట్టులో చేర్చుకుంది. జాషువా లిటిల్ 2022లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్‌పై హ్యాట్రిక్ ఆశ్చర్యపరిచాడు. ఈ హ్యాట్రిక్‌లో కేన్ విలియమ్సన్ వికెట్ కూడా ఉంది. 

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ మొదటి మ్యాచ్‌లో జాషువా లిటిల్ తన సత్తా నిరూపించుకున్నాడు. 4 ఓవర్లలో 10.20 ఎకానమీతో పరుగులు వెచ్చించి ఒక వికెట్ తీశాడు. భారీ స్కోరు దిశంగా దూసుకెళ్తున్న సమయంలో అంబటి రాయుడును బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపించాడు. జాషువా లిటిల్ ఐర్లాండ్ తరపున వన్డే, టీ20 మ్యాచ్‌లు ఆడుతున్నాడు. తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకు మొత్తం 25 వన్డేలు, 53 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 29.37 సగటుతో 38 వికెట్లు తీయగా.. టీ20ల్లో 23.76 సగటుతో 62 వికెట్లు తీశాడు. జాషువా సెప్టెంబరు 5, 2016న అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.

ఐపీఎల్ మొదటి మ్యాచ్‌లో గుజరాత్ జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలుపు సొంతం చేసుకుంది. 179 పరుగుల లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. గుజరాత్ బ్యాట్స్‌మెన్ల గిల్ (63), విజయ్ శంకర్ (27), వృద్ధిమాన్ సాహా (25), సాయి సుదర్శన్ (22) రాణించారు. చివర్లో తైవాటియా, రషీద్ ఖాన్ చెరో సిక్సర్, ఫోర్ బాది జట్టును గెలిపించారు. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (92) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. 

Also Read: LSG vs DC: లక్నో Vs ఢిల్లీ జట్ల మధ్య టఫ్‌ వార్.. ప్లేయింగ్ 11 ఇదే..!  

Also Read: PBKS Vs KKR: ఐపీఎల్‌లో మరో బిగ్‌ఫైట్.. పంజాబ్ Vs కోల్‌కత్తా హెడ్ టు హెడ్ రికార్డులు.. పిచ్ రిపోర్ట్ ఇదే..   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News