Gujarat Titans Vs Sunrisers Hyderabad Dream11 Team Prediction Today: ప్లే ఆఫ్స్ చేరేందుకు.. పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచేందుకు గుజరాత్ టైటాన్స్ ఒక్క అడుగు దూరంలో ఉంది. నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఓడినా హైదరాబాద్‌కు పెద్దగా పోయిందేమి లేదు. కాకపోతే పాయింట్ల పట్టికలో మెరుగైనా స్థానంలో నిలవాలని చూస్తోంది. గుజరాత్ `12 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో 16 పాయింట్లతో టాప్ ప్లేస్ ఉండగా.. అటు ఎస్‌ఆర్‌హెచ్ 11 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో 8 పాయింట్లతో కింది నుంచి స్థానం రెండో స్థానంలో ఉంది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచినా.. ప్లే ఆఫ్స్‌కు చేరడం కష్టమే. అహ్మదాబాద్‌లో నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ రికార్డులు, ప్లేయింగ్ 11, డ్రీమ్ 11 టీమ్ టిప్స్ మీ కోసం..
పిచ్ రిపోర్ట్ ఇలా..
అహ్మదాబాద్ పిచ్ ఎక్కువగా బ్యాటింగ్‌కు సహకరిస్తుంది. ఆరంభంలో పేసర్లు రాణించిన.. మ్యాచ్ సాగుతున్న కొద్ది బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడం సులువుగా ఉంటుంది. ఇక్కడ టాస్ కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్‌కు మొగ్గు చూపుతుంది. హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు 2 మ్యాచ్‌లు జరగ్గా.. ఒక మ్యాచ్‌లో గుజరాత్, ఒక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపొందాయి. ఈ మ్యాచ్‌లో గుజరాత్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న గుజరాత్ చివరి మ్యాచ్‌లో ముంబై చేతిలో ఓడిపోయింది. గత మ్యాచ్‌లో లక్నో చేతిలో ఓడిపోయిన హైదరాబాద్ ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకుంది. ప్లేయింగ్ 11లో రెండు జట్లు పెద్దగా మార్పులు చేసే అవకాశాలు కనిపించడం లేదు.
తుది జట్లు ఇలా..
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మాన్ గిల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), అభినవ్ మనోహర్ , డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, మోహిత్ శర్మ.
సన్‌రైజర్స్ హైదరాబాద్: అన్మోల్‌ప్రీత్ సింగ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, టి.నటరాజన్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, ఫజల్హాక్ ఫరూకీ, వివ్రాంత్ శర్మ.
డ్రీమ్ 11 టీమ్ టిప్స్..
వికెట్ కీపర్-వృద్ధిమాన్ సాహా, హెన్రిచ్ క్లాసెన్
బ్యాట్స్‌మెన్-డేవిడ్ మిల్లర్, అభిషేక్ శర్మ, శుభ్‌మాన్ గిల్ (కెప్టెన్)
ఆల్ రౌండర్లు- ఐడెన్ మార్‌క్రమ్, హార్దిక్ పాండ్యా
బౌలర్లు- భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, రషీద్ ఖాన్ (వైస్ కెప్టెన్), మోహిత్ శర్మ
Also Read: IPL 2023 Points Table: రేసులో దూసుకువచ్చిన ఆర్‌సీబీ.. ఆ జట్టు మాత్రం ఔట్
Also Read: Kadapa Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి