KKR Vs SRH Live Score Updates: చుక్కలు చూపించిన కేకేఆర్ బౌలర్లు.. ఎస్‌ఆర్‌హెచ్‌ వికెట్లు టపటపా

Kolkata Knight Riders Vs Sunrisers Hyderabad Score Live Updates: ఐపీఎల్ 2024 ట్రోఫీ కోసం కేకేఆర్, ఎస్‌ఆర్‌హెచ్ జట్ల మధ్య బిగ్‌ ఫైట్ జరగనుంది. రెండు జట్లు ఆరంభం నుంచి దుమ్ములేపే ప్రదర్శనతో ఆకట్టుకోగా.. ఫైనల్ పోరులోనూ అదే జోరు కంటిన్యూ చేయాలని చూస్తున్నాయి. ఎస్‌ఆర్‌హెచ్ Vs కేకేఆర్ లైవ్ స్కోరు ఇక్కడ క్లిక్ చేయండి.  

Written by - Ashok Krindinti | Last Updated : May 26, 2024, 09:17 PM IST
KKR Vs SRH Live Score Updates: చుక్కలు చూపించిన కేకేఆర్ బౌలర్లు.. ఎస్‌ఆర్‌హెచ్‌ వికెట్లు టపటపా
Live Blog

KKR Vs SRH IPL 2024 Final Match Live Updates: ఐపీఎల్ 2024 ఛాంపియన్ ఎవరో నేడు తేలిపోనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు సమరానికి సిద్ధమయ్యాయి. ట్రోఫీని ముద్దాడేందుకు రెండు జట్లు ఒక్క అడుగు దూరంలో ఉన్నాయి. కెప్టెన్ పాట్ కమిన్స్ సారథ్యంలో సన్‌రైజర్స్‌ అద్భుత ప్రదర్శన కనబర్చగా.. మెంటర్‌గా గౌతం గంభీర్ రాకతో కేకేఆర్ ఆటతీరు మొత్తం మారిపోయింది. క్వాలిఫయర్‌-1లో ఎస్‌ఆర్‌హెచ్‌ను ఓడించిన కేకేఆర్.. నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. క్వాలిఫయర్‌-2లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి సన్‌రైజర్స్ ఫైనల్‌లో చోటు దక్కించుకుంది. చెన్నైలోని ఎం.చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. రెండు జట్లలోనూ హార్డ్ హిట్టర్లు ఉండగా.. చెన్నై పిచ్ బౌలర్లకు సహకారం అందించనున్న నేపథ్యంలో పోరు ఎలా ఉంటుందని ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్ లైవ్‌ అప్‌డేట్స్‌ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
 

26 May, 2024

  • 21:17 PM

    KKR Vs SRH IPL 2024 Final Live Score: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగిసింది. 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌట్ అయింది. టోర్నీ మొత్తం అదరగొట్టిన హైదరాబాద్ బ్యాట్స్‌మెన్.. ఫైనల్ పోరులో మాత్రం చేతులేత్తేశారు.

  • 21:10 PM

    KKR Vs SRH IPL 2024 Final Live Score: సన్‌రైజర్స్ 113 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ఉనద్కత్‌ (4)ను నరైన్ ఔట్ చేశాడు. స్కోరు: 113/9 (18).

  • 21:02 PM

    17వ ఓవర్‌
    వంద పరుగులు దాటిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌
    2 వికెట్లు తీసిన హర్షిత్‌ రాణా రంగంలోకి
    17వ ఓవర్‌లో 1, 0, 2, 0, 6, 1
    పరుగుల కోసం కష్టపడుతున్న కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌, ఉనద్కట్‌
    10/8కు చేరిన హైదరాబాద్‌

  • 20:58 PM

    16వ ఓవర్‌లో..
    16వ ఓవర్‌ వేసిన సునీల్‌ నరైన్‌
    బ్యాటింగ్‌ చేస్తున్న ఉనద్కట్‌, కెప్టెన్‌ కమిన్స్‌
    98/8కు చేరిన సన్‌రైజర్స్‌

  • 20:52 PM

    15వ ఓవర్‌లో..
    హర్షిత్‌ రాణా 15వ ఓవర్‌లో వికెట్‌, 0, 0, 0, 0, 
    బ్యాటింగ్‌ చేస్తున్న ఉనద్కట్‌, కమిన్స్‌
    90/8కు చేరిన సన్‌రైజర్స్‌

    రివ్యూ కోల్పోయిన కేకేఆర్

  • 20:49 PM

    8వ వికెట్‌ కోల్పోయిన హైదరాబాద్‌
    15వ ఓవర్ లో క్లాసెన్‌ను ఔట్‌ చేసిన హర్షిత్‌ రాణా
    16 పరుగులకు వెనుతిరిగిన హెన్రిచ్‌ క్లాసెన్‌

  • 20:47 PM

    14వ ఓవర్‌
    వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో మొదటి బంతికి ఫోర్‌ కొట్టిన కెప్టెన్‌ కమిన్స్‌
    4, 1, 0, 2, 1, 0
    90/7కు చేరి మరింత కష్టాల్లో సన్‌రైజర్స్‌
    పరుగుల కోసం కష్టపడుతున్న క్లాసెన్‌, కమిన్స్‌

  • 20:43 PM

    13వ ఓవర్‌లో
    2, 1, 1‌, వైడ్‌, వికెట్‌, 4, 1
    పోరాడుతున్న క్లాసెన్‌, కెప్టెన్‌ కమిన్స్‌
    87/7కు చేరి మరింత కష్టాల్లో హైదరాబాద్

  • 20:39 PM

    7వ వికెట్‌ కోల్పోయిన సన్‌రైజర్స్‌

    13వ ఓవర్‌లో రసెల్‌ బౌలింగ్‌కు అబ్దుల్‌ సమద్‌ బలి
    ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన అబ్దుల్‌ సమద్‌ 4 పరుగులకే పరిమితం

     

  • 20:36 PM

    షాబాజ్‌ ఔట్‌
    రంగంలోకి దిగిన వెంటనే వికెట్‌ తీసుకున్న వరుణ్‌ చక్రవర్తి
    12వ ఓవర్‌ వేసిన వరుణ్‌ చక్రవర్తి
    ౦, 1, 0, 0, వికెట్‌.
    పరుగుల కోసం పోరాడుతున్న క్లాసెన్‌
    71/6కు చేరి కష్టాల్లో మునిగిన హైదరాబాద్‌

     

  • 20:28 PM

    KKR Vs SRH IPL 2024 Final Live Score: పది ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ నాలుగు వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. మార్క్‌రమ్ (20), క్లాసెన్ (10) క్రీజ్‌లో ఉన్నారు.

  • 20:25 PM

    KKR Vs SRH IPL 2024 Final Live Score: 9వ ఓవర్‌లో క్లాసెన్ ఓ బౌండరీ బాదాడు. ఈ ఓవర్‌లో మొత్తం 7 రన్స్ వచ్చాయి. స్కోరు: 58-4.

  • 20:20 PM

    KKR Vs SRH IPL 2024 Final Live Score: 8వ ఓవర్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే వచ్చాయి. స్కోరు: 51-4.

  • 20:14 PM

    KKR Vs SRH IPL 2024 Final Live Score: సన్‌రైజర్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. నితీష్ రెడ్డి (13)ని హర్షిత్ రాణా ఔట్ చేశాడు. స్కోరు: 47/4 (7).

  • 20:09 PM

    KKR Vs SRH IPL 2024 Final Live Score: ఆరో ఓవర్‌లో మార్క్‌రమ్, నితీష్‌ రెడ్డి బ్యాట్ ఝులిపించారు. మార్క్‌రమ్ రెండు ఫోర్లు బాదగా.. నితీష్ రెడ్డి ఒక సిక్సర్ బాదాడు. ఈ ఓవర్‌లో మొత్తం 17 పరుగులు వచ్చాయి. ఆరు ఓవర్లు ముగిసేసరికి స్కోరు: 40-3.

  • 20:04 PM

    KKR Vs SRH IPL 2024 Final Live Score: ఐదో ఓవర్‌లో స్టార్క్ కేవలం రెండు పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. స్కోరు: 23-3.

  • 19:59 PM

    KKR Vs SRH IPL 2024 Final Live Score: సన్‌రైజర్స్‌ను స్టార్క్ మరోసారి దెబ్బ తీశాడు. రాహుల్ త్రిపాఠి (9)ని పెవిలియన్ బాట పట్టించాడు.

  • 19:55 PM

    KKR Vs SRH IPL 2024 Final Live Score: నాలుగో ఓవర్‌లో వైభవ్ ఆరోరా మూడు వైడ్స్ వేశాడు. మూడు సింగిల్స్‌తో కలిపి మొత్తం ఆరు పరుగులు వచ్చాయి. స్కోరు: 21/2 (4).

  • 19:49 PM

    KKR Vs SRH IPL 2024 Final Live Score: మూడో ఓవర్‌లో స్టార్క్ 9 పరుగులు ఇచ్చాడు. మార్క్‌రమ్, త్రిపాఠి చెరో బౌండరీ బాదారు. స్కోరు: 15/2 (3) 
     

  • 19:36 PM

    KKR Vs SRH IPL 2024 Final Live Score: సన్‌రైజర్స్‌కు తొలి ఓవర్‌లోనే స్టార్క్ బిగ్‌ షాకిచ్చాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ (2)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ ఓవర్‌లో కేవలం 3 పరుగులు మాత్రమే వచ్చాయి.

  • 19:14 PM

    Kolkata Knight Riders Vs Sunrisers Hyderabad playing XI: సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి.నటరాజన్.

    కోల్‌కతా నైట్ రైడర్స్: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి.
     

  • 19:05 PM

    KKR Vs SRH IPL 2024 Toss Updates: టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో కేకేఆర్ మొదట బౌలింగ్ చేయనుంది.

  • 18:44 PM

    KKR Vs SRH IPL 2024 Head to Head Records: కేకేఆర్, ఎస్‌ఆర్‌హెచ్ హెడ్ టు హెడ్ రికార్డుల విషయానికి వస్తే.. కోల్‌కతా 18 సార్లు గెలుపొందగా.. సన్‌రైజర్స్ తొమ్మిది మ్యాచ్‌లు గెలిచింది.

  • 18:41 PM

    KKR Vs SRH IPL 2024 Final Live Score: ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల విధ్వంసం ఈ సీజన్‌లో ఓ రేంజ్‌లో ఉంది. బౌలర్లపై దారుణంగా విరుచుకుపడుతూ ఊచకోత కోస్తున్నారు. ఫైనల్‌లో పోరులోనూ అదే ఊపుతో జట్టుకు టైటిల్ అందించాలని సన్‌రైజర్స్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Trending News