India Vs New Zealand 1st ODI: టీమిండియాను వణికించిన మైఖేల్ బ్రేస్‌వెల్.. ఉత్కంఠ పోరులో రోహిత్ సేన విజయం!

India vs New Zealand Updates: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచులో రోహిత్ సేన 12 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 19, 2023, 12:24 PM IST
  • India vs New Zealand Updates: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచులో రోహిత్ సేన 12 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.
India Vs New Zealand 1st ODI: టీమిండియాను వణికించిన మైఖేల్ బ్రేస్‌వెల్.. ఉత్కంఠ పోరులో రోహిత్ సేన విజయం!
Live Blog

India vs New Zealand Updates: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచులో రోహిత్ సేన 12 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.

19 January, 2023

  • 21:56 PM

    హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచులో రోహిత్ సేన 12 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. కివీస్ బ్యాటర్ మైఖేల్ బ్రేస్‌వెల్ (140; 78 బంతుల్లో 12 ఫోర్లు, 10 సిక్స్‌లు) టీమిండియాను వణికించాడు. చివరికి బ్రేస్‌వెల్ ఎల్బీగా వెనుదిరగడంతో కివీస్ 49.2 ఓవర్లలో 337 రన్స్ చేసి ఆలౌట్ అయింది. అంతకుముందు భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోరు సాధించింది.  ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌ (208; 149 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్స్‌లు) డబుల్ సెంచరీతో చెలరేగాడు. 
     

  • 21:42 PM

    న్యూజిలాండ్‌ తొమ్మిదవ వికెట్ కోల్పోయింది. లూకి ఫెర్గూసన్ (8) ఔటయ్యాడు. హార్దిక్ పాండ్యా వేసిన 49వ ఓవర్ మూడో బంతికి క్యాచ్ ఔట్ అయ్యాడు. 
     

  • 21:28 PM

    హైదరాబాద్ పేసర్ మొహ్మద్ సిరాజ్ ఒకే ఓవర్లో రెండు వికెట్స్ పడగొట్టాడు. మిచెల్ సాంట్నర్ (57)తో పాటు హెన్రీ షిప్లీ (0)ని పెవిలియన్ చేర్చాడు. 
     

  • 21:19 PM

    45 ఓవర్లకు కివీస్ స్కోర్ 291/6. క్రీజులో మైఖేల్ బ్రేస్‌వెల్ (107), మిచెల్ శాంటర్న్‌ (56) ఉన్నారు. 
     

  • 21:08 PM

    42 ఓవర్లు: న్యూజిలాండ్‌ స్కోర్ 260/6. క్రీజులో మైఖేల్ బ్రేస్‌వెల్ (97), మిచెల్ సాంట్నర్ (37) ఉన్నారు. కివీస్ విజయానికి 8 ఓవర్లలో 90 రన్స్ అవసరం. 
     

  • 20:55 PM

    40 ఓవర్లకు కివీస్ స్కోర్ 247/6. క్రీజులో మైఖేల్ బ్రేస్‌వెల్ (89), మిచెల్ శాంటర్న్‌ (33) ఉన్నారు. 
     

  • 20:42 PM

    న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ మిచెల శాంటర్న్‌ దూకుడుగా ఆడుతున్నాడు. ఫోర్లు, సిక్సులతో మైదానాన్ని హోరెత్తిస్తున్నాడు. మరోవైపు మైఖేల్ బ్రాస్‌వెల్ కూడా నిలకడగా ఆడుతున్నాడు. 37 ఓవర్లకు స్కోరు 214/6. శాంటర్న్‌ (28), మైఖేల్ (65) క్రీజులో ఉన్నారు. 
     

  • 20:33 PM

    36 ఓవర్లకు కివీస్ స్కోర్ 188/6. క్రీజులో మైఖేల్ బ్రేస్‌వెల్ (46), మిచెల్ సాంట్నర్ (27) ఉన్నారు. 
     

  • 20:24 PM

    33 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్‌ ఆరు వికెట్ల నష్టానికి 162 రన్స్ చేసింది. క్రీజులో మైఖేల్ బ్రేస్‌వెల్ (30), మిచెల్ సాంట్నర్ (22) ఉన్నారు. 
     

  • 20:06 PM

    లోకల్ బాయ్ మొహ్మద్ సిరాజ్ రెండో వికెట్ పడగొట్టాడు. సొంత మైదానం ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్‌  కెప్టెన్ టామ్ లాతమ్ (24)ను ఔట్ చేశాడు. దాంతో మైదానం మొత్తం అభిమానుల కేరింతలతో ఊగిపోయింది. 

  • 19:56 PM

    27 ఓవర్లు: న్యూజిలాండ్‌ స్కోర్ 126/5. టామ్ లాతమ్ (20), మైఖేల్ బ్రేస్‌వెల్ (11) క్రీజులో ఉన్నారు. 
     

  • 19:46 PM

    న్యూజిలాండ్‌ ఐదవ వికెట్ కోల్పోయింది. గ్లెన్ ఫిలిప్స్ (181) ఔటయ్యాడు. మొహ్మద్ షమీ వేసిన 25వ ఓవర్ మూడో బంతికి బోల్డ్ అయ్యాడు. 
     

  • 19:43 PM

    24 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్‌ నాలుగు వికెట్ల నష్టానికి 110 రన్స్ చేసింది. క్రీజులో టామ్ లాతమ్ (16), గ్లెన్ ఫిలిప్స్ (11) ఉన్నారు. 
     

  • 19:40 PM

    ఉప్పల్ మైదానంలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తుండటంతో.. పరుగులు చేయడానికి కివీస్‌ బ్యాటర్లు కష్టపడుతున్నారు. కుల్దీప్, శార్దూల్ వేసిన చివరి నాలుగు ఓవర్లలో 9 పరుగులు మాత్రమే ఇచ్చారు. 

  • 19:35 PM

    22 ఓవర్లకు కివీస్ స్కోర్ 104/4. టామ్ లాతమ్ (14), గ్లెన్ ఫిలిప్స్ (8) క్రీజులో ఉన్నారు. 
     

  • 19:27 PM

    20 ఓవర్లు: న్యూజిలాండ్‌ స్కోర్ 97/4. టామ్ లాతమ్ (8), గ్లెన్ ఫిలిప్స్ (6) క్రీజులో ఉన్నారు. 
     

  • 19:22 PM

    కుల్దీప్ యాదవ్‌ వేసిన 17.4 ఓవర్‌కు డారిల్ మిచెల్ (18) ఎల్బీగా ఔట్ అయ్యాడు. దీంతో కివీస్‌ నాలుగో వికెట్ కోల్పోయింది. 18 ఓవర్లకు కివీస్ స్కోరు 95-4. టామ్ లాతమ్ (6), గ్లెన్ ఫిలిప్స్ (6) క్రీజులో ఉన్నారు. 
     

  • 19:18 PM

    17 ఓవర్లకు కివీస్ స్కోర్ 85-3. డారిల్ మిచెల్ (5), టామ్ లాతమ్ (6) క్రీజులో ఉన్నారు. 
     

  • 19:11 PM

    న్యూజిలాండ్‌ మూడో వికెట్ కోల్పోయింది. హెన్రీ నికోల్స్‌ (18) ఔటయ్యాడు. కుల్దీప్ యాదవ్ వేసిన 16వ ఓవర్ మూడో బంతికి బోల్డ్ అయ్యాడు. 

  • 19:04 PM

    15 ఓవర్లు: న్యూజిలాండ్‌ స్కోర్ 74/2 (15). క్రీజులో హెన్రీ నికోల్స్‌ (14), డారిల్ మిచెల్ (4) ఉన్నారు. 
     

  • 18:59 PM

    న్యూజిలాండ్‌ రెండో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న ఫిన్‌ అలెన్ (40) ఔటయ్యాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన 13వ ఓవర్ ఐదవ బంతికి క్యాచ్ ఔట్ అయ్యాడు. 

  • 18:52 PM

    12 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్‌ ఒక వికెట్ నష్టానికి 69 రన్స్ చేసింది. హెన్రీ నికోల్స్‌ (14), ఫిన్‌ అలెన్ (40) క్రీజులో ఉన్నారు. 
     

  • 18:35 PM

    టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. పది ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 42-1. 

  • 18:31 PM

    తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి కివీస్ స్కోరు 32-1. అలెన్ (17), నీకోలస్ (1) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు.

  • 18:26 PM

    వరుసగా మూడో ఓవర్ కూడా మెడిన్ అయింది. 8వ ఓవర్‌లో సిరాజ్ ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. కివీస్ స్కోరు 28-0.

  • 18:21 PM

    ఏడో ఓవర్‌ను మహ్మద్ షమీ కూడా మెడిన్ చేశాడు. దీంతో వరుసగా 17 బాల్స్‌ డాట్ అయ్యాయి. అయితే ఈ ఓవర్ చివరి బంతి షమీ చేయికి తగలడంతో మైదానాన్ని వీడాడు.

  • 18:20 PM

    ఆరో ఓవర్‌ను లోకల్ బాయ్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మెడిన్ ఓవర్ వేయడంతో పాటు కాన్వేను ఔట్ చేశాడు. ఈ ఓవర్‌లో కివీస్ ఒక్క పరుగు కూడా చేయలేకయింది.

  • 18:16 PM

    కివీస్‌ను హైదరాబాదీ పేసర్ సిరాజ్ తొలి దెబ్బ తీశాడు. డేంజర్ బ్యాట్స్‌మెన్ కాన్వే (10) పెవిలియన్‌కు పంపించాడు. భారీ షాట్‌కు ప్రయత్నించగా.. కుల్దీప్ యాదవ్ చక్కటి క్యాచ్‌ అందుకున్నాడు.

  • 18:11 PM

    ఐదో ఓవర్‌లో షమీ సూపర్‌గా బౌలింగ్ చేశాడు. తొలి బంతికి బౌండరీ ఇచ్చినా.. తరువాత ఐదు బాల్స్‌ను డాట్ చేశాడు. కివీస్ స్కోరు 28-0.

  • 18:06 PM

    నాలుగు ఓవర్లు ముగిసేసరికి కివీస్ వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. కాన్వే (10), ఫిన్ అలెన్ (10) క్రీజ్‌లో ఉన్నారు. చెరో రెండు బౌండరీలు బాదారు.

  • 18:01 PM

    మూడో ఓవర్‌లో షమీ ఆరు పరుగులు ఇచ్చాడు. స్కోరు మూడు ఓవర్లకు 18-0.

  • 17:58 PM

    రెండో ఓవర్‌లో కాన్వే దూకుడు పెంచాడు. సిరాజ్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు కొట్టాడు. స్కోరు 2 ఓవర్లు 12-0.
     

  • 17:57 PM

    350 పరుగుల భారీ లక్ష్యంతో కివీస్ బరిలోకి దిగింది. మొదటి ఓవర్‌లో ఓపెనర్ ఫిన్ అలెన్ ఓ బౌండరీ బాదాడు. 
     

  • 17:19 PM

    భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (208) అద్బుత ఇన్నింగ్స్ ఆడగా.. రోహిత్ శర్మ (34), సూర్యకుమార్ యాదవ్ (31), హార్ధిక్ పాండ్యా (28) పర్వాలేదనిపించారు. కివీస్ బౌలర్లలో షిప్లే, మిచెల్ చెరో రెండు వికెట్లు తీయగా.. ఫెర్గ్యూసన్, టింక్నర్, శాంట్నర్ తలో వికెట్ పడగొట్టారు.

  • 17:15 PM

    డబుల్ సెంచరీ హీరో శుభ్‌మన్ గిల్ (208) ఔట్ అయ్యాడు. దీంతో అద్భుత ఇన్నింగ్స్‌కు తెరపడింది.
     

  • 17:11 PM

    శుభ్‌మన్‌ గిల్ సిక్సర్ల వర్షం కురిపించాడు. 49వ ఓవర్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. దీంతో డబుల్ సెంచరీ మార్కు చేరుకున్నాడు. భారత్ స్కోరు 49 ఓవర్లు 339-7

  • 17:06 PM

    48వ ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదాడు గిల్. దీంతో ఈ ఓవర్‌లో 15 పరుగులు వచ్చాయి. భారత్ స్కోరు 48 ఓవర్లు 318-7
     

  • 17:01 PM

    భారత్ స్కోరు 300 మార్క్ దాటింది. శుభ్‌మన్ గిల్ (169) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. 47వ ఓవర్‌లో శార్దుల్ ఠాకూర్ రనౌట్ అయ్యాడు. గిల్ కోసం తన వికెట్ త్యాగం చేశాడు. భారత్ స్కోరు 47 ఓవర్లు 303-7.

  • 16:56 PM

    కివీస్ ఫీల్డర్లు బౌండరీ లైన్ వద్ద అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తున్నారు. దీంతో టీమిండియా స్కోరు నెమ్మదిగా కదులుతోంది. స్కోరు 46 ఓవర్లు 299-6.

  • 16:50 PM

    టీమిండియా జోరు తగ్గింది. 45వ ఓవర్ చివరి బంతికి వాషింగ్టన్ సుందర్ (12) ఎల్బీడబ్యూ అయ్యాడు. స్కోరు 45 ఓవర్లు 292-6.
     

  • 16:44 PM

    44 ఓవర్లు ముగిసేసరికి స్కోరు  286-5. ఈ ఓవర్‌లో  7 పరుగులు వచ్చాయి.
     

  • 16:43 PM

    శుభ్‌మన్ గిల్ దూకుడు కొనసాగుతోంది. సిక్సర్‌తో 150 మార్క్ దాటేశాడు. 43 ఓవర్లు ముగిసేసరికి స్కోరు  279-5. ఈ ఓవర్‌లో 10 పరుగులు వచ్చాయి.

  • 16:36 PM

    టీమిండియా స్కోరు బోర్డును శుభ్‌మన్ గిల్ (146) పరుగులు పెట్టిస్తున్నాడు. 42 ఓవర్‌లో 12 పరుగులు వచ్చాయి. స్కోరు 42 ఓవర్లు 269-5.

  • 16:32 PM

    41 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 257-5. ఈ ఓవర్‌లో 6 పరుగులు వచ్చాయి.
     

  • 16:30 PM

    భారత్ స్కోరు 250 మార్కు దాటింది. 40 ఓవర్‌లో పాండ్యా వికెట్ కోల్పోవడంతో కేవలం 5 పరుగులు మాత్రమే వచ్చాయి. స్కోరు 40 ఓవర్లు 251-5.

  • 16:23 PM

    అనూహ్యంగా హార్ధిక్ పాండ్యా (28) ఔట్ అయ్యాడు. మిచెల్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్ అయ్యాడు. 
     

  • 16:18 PM

    శుభ్‌మన్ గిల్ (131) క్రీజ్‌లో పాతుకుపోయాడు. మరో ఎండ్‌లో హార్ధిక్ పాండ్యా (27) చక్కగా సహకరిస్తున్నాడు. స్కోరు 39 ఓవర్లు 246-4.

  • 16:13 PM

    38 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 239-4. ఈ ఓవర్‌లో 7 పరుగులు వచ్చాయి.
     

  • 16:09 PM

    గిల్, పాండ్యా ఐదు వికెట్‌కు 50 పరుగులు జోడించారు. 37 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 232-4
     

Trending News