మరో రికార్డు బ్రేక్ చేసిన ధోని.. 300 క్యాచ్‌తో ఎలైట్ లిస్టులో చేరిన క్రికెట్ దిగ్గజం

భారతీయ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని మరో రికార్డు బ్రేక్ చేశారు. వన్డేల్లో 300 క్యాచ్‌లు పట్టిన నాల్గవ వికెట్ కీపరుగా ఆయన రికార్డులకెక్కారు. 

Last Updated : Jul 15, 2018, 08:36 AM IST
మరో రికార్డు బ్రేక్ చేసిన ధోని.. 300 క్యాచ్‌తో ఎలైట్ లిస్టులో చేరిన క్రికెట్ దిగ్గజం

భారతీయ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని మరో రికార్డు బ్రేక్ చేశారు. వన్డేల్లో 300 క్యాచ్‌లు పట్టిన నాల్గవ వికెట్ కీపరుగా ఆయన రికార్డులకెక్కారు. ఇంగ్లాండ్‌తో లార్డ్స్ గ్రౌండులో జరుగుతున్న రెండవ వన్డేలో బ్యాట్స్‌మన్ జాస్ బట్లర్ ఇచ్చిన క్యాచ్ పట్టి ఆయన ఆ ఘనత సాధించాడు. ఈ క్రమంలో ధోని ఇదే రికార్డును ఇంతకు ముందు సాధించిన ఆడమ్ గిల్ క్రిస్ట్, మార్క్ బౌచర్, కుమార సంగక్కర వంటి వికెట్ కీపర్ల సరసన చేరాడు.

ప్రస్తుత రికార్డుల ప్రకారం గిల్ క్రిస్ట్ ఖాతాలో 417 క్యాచ్‌లు ఉండగా.. బౌచర్ ఖాతాలో 403 క్యాచ్‌లు ఉన్నాయి. వారి తర్వాతి స్థానంలో ధోని ఉన్నారు. ధోని తర్వాతి స్థానంలో 262 క్యాచ్‌లతో బ్రెండన్ మాకల్లమ్ ఉన్నారు. గతంలో ధోని ఇంగ్లాండుతో జరిగిన టీ20ఐ సిరీస్‌లోనే ఆ ఫార్మాట్ క్రికెట్‌లో 50 క్యాచ్‌లు పట్టిన తొలి వికెట్ కీపరుగా రికార్డు సాధించారు. 

ఇవే కాకుండా ధోని పేరు మీద చాలా రికార్డులు ఉన్నాయి. గతంలో ఆయన అంతర్జాతీయ క్రికెట్‌లో అధిక స్టంపింగ్‌లు(178) చేసిన వికెట్‌ కీపర్‌గా కూడా వార్తలలోకెక్కాడు. అలాగే భారత జట్టు తరపున ఆరు ప్రపంచ టీ20 టోర్నీలకు రథసారధిగా వ్యవహరించిన ఏకైక కెప్టెన్‌ కూడా ధోనియే.

అదేవిధంగా.. అంతర్జాతీయ క్రికెట్‌లో 500 మ్యాచ్‌లు ఆడిన మూడో భారత క్రికెటర్‌ ధోని. అలాగే ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అత్యధిక శతకాలు చేసిన క్రీడాకారుడిగా కూడా ధోని రికార్డు నమోదు చేశాడు. అలాగే ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి రెండు సెంచరీలు చేసిన సూపర్ క్రికెటర్ కూడా ధోనియే. 

Trending News