M S Dhoni Golden Innings: కీలకమైన, మలుపు తిప్పిన నిర్ణయాలివే

భారత క్రికెట్ ( Indian cricket ) ను సువర్ణాధ్యాయానికి తీసుకెళ్లిన క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ అనే చెప్పాలి. భారత్ కు రెండోసారి ప్రపంచకప్ ను సాధించిపెట్టింది ధోనీనే. టీ 20 ప్రపంచ కప్ ఇండియాకు దక్కిందీ ధోనీ( Dhoni ) నేతృత్వంలోనే. ధోనీను నెంబర్ వన్ చేసిన ఆ కీలక నిర్ణయాలేంటి

Last Updated : Aug 16, 2020, 01:32 PM IST
M S Dhoni Golden Innings: కీలకమైన, మలుపు తిప్పిన నిర్ణయాలివే

భారత క్రికెట్ ( Indian cricket ) ను సువర్ణాధ్యాయానికి తీసుకెళ్లిన క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ అనే చెప్పాలి. భారత్ కు రెండోసారి ప్రపంచకప్ ను సాధించిపెట్టింది ధోనీనే. టీ 20 ప్రపంచ కప్ ఇండియాకు దక్కిందీ ధోనీ( Dhoni ) నేతృత్వంలోనే. ధోనీను నెంబర్ వన్ చేసిన ఆ కీలక నిర్ణయాలేంటి

టీమ్ ఇండియా కెప్టెన్ ( Team India captain ) సామర్ధ్యం అనేది సరైన  సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలోనే ఉంటుంది. మహేంద్ర సింగ్ ధోనీ ( Mahendra singh dhoni ) అదే చేశాడు. సక్సెస్ అయ్యాడు. ఇండియాకు ప్రపంచకప్ ( World cup )  తో పాటు టీ20 వలర్డ్ కప్ ( T20 World cup ) ను, ఛాంపియన్స్ లీగ్ ( Champions league ) ను సాధించిపెట్టాడు. భారత క్రికెట్ లో చెరగని ముద్రేసిన ధోనీ తీసుకున్న కొన్ని కీలకమైన అసాధారణ నిర్ణయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. Also read: MS Dhoni retirement: సాక్షి ఎమోషనల్ పోస్ట్

2007లో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ ( T20 world cup final )..పాకిస్తాన్ ప్రత్యర్ది దేశం. చివరి ఓవర్ లో పాక్ గెలుపు కోసం 13 పరుగులు సాధించాలి. సాధ్యమే. ఎందుకంటే క్రీజ్ లో మిస్బావుల్ హక్ ఉన్నాడు. హఠాత్తుగా హర్బజన్ కు బాల్ ఇవ్వకుండా జోగిందర్ శర్మ ( joginder sharma ) కు చివరి ఓవర్ ఇచ్చాడు ధోనీ. అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ధోనీ అంచనాల్ని నిజం చేస్తూ మూడోబాల్ కే హక్ ను పెవిలియన్ కు పంపించాడు. 

2011 ప్రపంచకప్ ఫైనల్ ( 2011 World cup final ) లో శ్రీలంక ( Srilanka ) బౌలర్ కులశేఖర బౌలింగ్ లో ధోనీ సిక్సర్ ను ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. ఫామ్ లో ఉన్న యువరాజ్ ను కాదని..ఐదో నంబర్ లో ధోనీ క్రీజ్ లో దిగాడు. అటువైపు క్రీజ్ లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ గౌతమ్ గంభీర్ ఉన్నాడు. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ తో స్పిన్నర్లకు కన్ఫ్యూజ్ చేయవచ్చనేది ధోనీ ఆలోచన. అదే సక్సెస్ అయింది. 91 పరుగులు సాధించాడు. Also read: Gautam Gambhir: ధోనీ రిటైర్మెంట్‌పై భిన్నంగా స్పందించిన గంభీర్

యువరాజ్ సింగ్ ( Yuvaraj singh ) అంటే సహజంగా బ్యాటింగ్ మాత్రమే గుర్తొస్తుంది.  2011 ప్రపంచకప్ లో యువరాజ్ ను ధోనీ రెగ్యులర్ బౌలర్ గా మార్చేశాడు. ప్రత్యర్ధుల్ని ఇరుకున పెట్టేందుకు ఈ వ్యూహం ఫలించిందని చెప్పవచ్చు. 9 మ్యాచ్ లలో 75 ఓవర్లు వేసి 15 వికెట్లు పడగొట్టాడు.

2008లో అస్ట్రేలియాలో జరిగిన ట్రై సిరీస్ ( Tri series ) లో యువకుల్ని ఎంపిక చేయాలని..ఫీల్డింగ్ లో మార్పులు చేయాలని సెలెక్టర్లకు గట్టిగా చెప్పాడు. చాలామంది ఈ విషయంలో ధోనీని విమర్శించినా...ఆ సిరీస్ ను గెల్చుకోవడంతో ధోనీ నిర్ణయం కీలకంగా మారింది. గౌతమ్ గంభీర్ ( Goutham gambhir ), రోహిత్ శర్మ ( Rohit sharma ), ప్రవీణ్ కుమార్ ( pravin kumar ) ల పాత్ర ఈ సిరీస్ లో ముఖ్యమైంది.

ఎప్పుడూ మిడిల్ ఆర్డర్ లో ఆడుతుండే రోహిత్ శర్మ ప్రతిభకు తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయేవాడు. ఇది గుర్తించిన ధోనీ..నేరుగా ఓపెనర్ గా ప్రమోట్ చేసి బరిలో దింపాడు. ఇంకేం..అంతర్జాతీయ క్రికెట్ లో ఫాస్టెస్ట్ బ్యాట్స్ మెన్ గా రోహిత్ శర్మ ఘనత సాధించాడు. Also read: Mahendra singh Dhoni: క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ

Trending News