Pakistan Cricket Team: భారత ఆతిథ్యానికి ఫిదా అయిన పాక్ క్రికెటర్లు.. ఏమన్నారంటే?

Pakistan Cricket Team: వన్డే వరల్డ్ కప్ కోసం భారత గడ్డపై అడుగుపెట్టిన పాకిస్థాన్ జట్టుకు అదిరిపోయే స్వాగతం లభించింది. మన ఆతిథ్యానికి ఫిదా అయిన పాక్ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 29, 2023, 10:48 AM IST
Pakistan Cricket Team: భారత ఆతిథ్యానికి ఫిదా అయిన పాక్ క్రికెటర్లు.. ఏమన్నారంటే?

ODI World Cup 2023: మరో ఆరు రోజుల్లో మెగా సమరం(World Cup 2023) ఆరంభంకానుంది. భారత్ వేదికగా జరిగే వన్డ్ వరల్డ్ కప్ ఒక్కొక్క జట్టు ఇండియాకు చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో దాయాది జట్టు భారత గడ్డపై కాలుమోపింది. భారీ భద్రత నడుమ రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టిన బాబర్ సేనకు  ఘన స్వాగతం లభించింది. బస చేసిన పార్క్‌ హయత్‌ హోటల్‌లోనూ ఇదే స్థాయిలో ఆహ్వానం లభించడంతో పాక్ క్రికెటర్లు మన దేశ ఆతిథ్యానికి ఫిదా అయ్యారు. దీనిపై పాక్ కెప్టెన్ బాబర్, పేస్ బౌలర్ షాహీన్ ఆఫ్రీదీ ట్వీట్ చేశాడు. 

హైదరాబాదీల ప్రేమాభిమానానికి పొంగిపోయనని బాబర్ అంటే.. హైదరాబాద్‌, ఇండియా గ్రేట్‌ వెల్‌కం అని షాహీన్‌ ఆఫ్రీదీ పోస్ట్‌ చేశాడు. ఏడేళ్ల తర్వాత భారత్ గడ్డపై కాలు మోపిన పాక్ జట్టుకు టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్ విరాట్‌ కోహ్లీ హృదయపూర్వక స్వాగతం పలికాడు. అంతేకాదు తన ఇంట్లో దాయాది ఆటగాళ్లకు విందు ఇస్తానని కూడా తెలిపాడు. ఈ మేరకు ట్వీట్ కూడా చేశాడు. 

శుక్రవారం బాబర్ సేన ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్ జట్టుతో తొలి వార్మప్ మ్యాచ్ ఆడనుంది. రెండు జట్లు ఈ మ్యాచ్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గురువారం ఇరుజట్లు ఆటగాళ్లు కాసేపు ప్రాక్టీస్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి మ్యాచ్‌ ప్రారంభం కానుంది. భద్రతా కారణాల దృష్ట్యా ప్రేక్షకులను ఈ మ్యాచ్‌కు అనుమతించడం లేదు. అంతేకాకుండా పాక్‌ క్రికెటర్లకు హైదరాబాద్‌ పోలీసులు అదనపు భద్రతను కూడా కల్పిస్తున్నారు.

Also Read: Kushal Malla: 34 బంతుల్లో సెంచరీ.. రోహిత్ శర్మ రికార్డు గోవింద.. గోవిందా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News