కోహ్లీ పెళ్ళికి మేమే ఆతిథ్యం ఇస్తాం..!

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకవేళ బాలీవుడ్ నటి అనుష్క శర్మను పెళ్ళి చేసుకుంటే.. తాము ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అడిలైడ్‌లోని ఓవల్ స్టేడియం బహిరంగ ప్రకటన  చేసింది. 

Last Updated : Dec 8, 2017, 02:18 PM IST
కోహ్లీ పెళ్ళికి మేమే ఆతిథ్యం ఇస్తాం..!

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకవేళ బాలీవుడ్ నటి అనుష్క శర్మను పెళ్ళి చేసుకుంటే.. తాము ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అడిలైడ్‌లోని ఓవల్ స్టేడియం బహిరంగ ప్రకటన చేసింది. ఈ విషయాన్ని స్వయంగా అడిలైడ్ ఓవల్ సీఈవో ఆండ్రూ డేనియల్స్ తెలియజేశారు. చిత్రమేంటంటే ఈ స్టేడియానికి, కోహ్లీకి ఎంతో అనుబంధం ఉంది.

2012లో ఇదే స్టేడియంలోతన తొలి టెస్టు సెంచరీ నమోదు చేశాడు కోహ్లీ. అడిలైడ్ ఓవల్ స్టేడియానికి 146 ఏళ్ళ చరిత్ర ఉందని.. ఇటీవలే ఈ స్టేడియాన్ని మరింత ఆధునికంగా తీర్చిదిద్దామని.. ఒకవేళ కోహ్లీ ఒప్పుకుంటే ఆయన వివాహానికి ఈ స్టేడియాన్ని వేదికగా అందివ్వడానికి తమకు అభ్యంతరం లేదని.. అది ఈ స్టేడియానికి దక్కిన గౌరవంగా తాము భావిస్తామని సీఈఓ డేనియల్స్ తెలిపారు.ఇప్పటికే ఈ స్టేడియాన్ని వివాహ వేడుకలకు కూడా అద్దెకిస్తున్నారట. ఈ స్టేడియంలో దాదాపు 20 ఫంక్షన్ హాళ్లు కూడా ఉన్నాయట. 

Trending News