ఐపీఎల్‌కు రెండేళ్ల పాటు ముస్తాఫిజుర్ దూరం

బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌(22)పై ఆ దేశ క్రికెట్ బోర్డు(బీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది.

Last Updated : Jul 21, 2018, 04:29 PM IST
ఐపీఎల్‌కు రెండేళ్ల పాటు ముస్తాఫిజుర్ దూరం

బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌(22)పై ఆ దేశ క్రికెట్ బోర్డు(బీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల పాటు విదేశాల్లో జరిగే టీ 20 లీగ్‌లకు దూరంగా ఉండాలని బీసీబీ అధ్యక్షుడు నజ్ముల్ హసన్ తెలిపారు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)తో సహా మరే ఇతర విదేశీ లీగ్‌లలో పాల్గొనకూడదంటూ ముస్తాఫిజుర్‌ను ఆదేశించింది. ఆదేశాలను బేఖాతరు చేస్తే కఠిన నిర్ణయాలు తప్పవని హెచ్చరించింది. 

విదేశాల్లో జరిగే టీ20 లీగ్‌లకు ఎక్కువగా హాజరవుతూ.. తరచూ గాయాలబారిన పడుతున్న ముస్తాఫిజుర్‌ బంగ్లాదేశ్ జట్టుకు అందుబాటులో ఉండటం లేదు. దీన్ని మేము సీరియస్‌గా తీసుకున్నామని.. దాంతో అతన్ని రెండేళ్లపాటు టీ20 లీగ్‌లకు దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. బంగ్లాదేశ్‌ జట్టులో బౌలింగ్‌ విభాగంలో ముస్తాఫిజుర్‌ ఎంతో కీలకమైన ఆటగాడని.. అతడిని కోల్పోవడం వల్ల తమ జట్టు ఓటములు చవిచూడాల్సి వస్తోందని.. దీంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని నజ్ముల్‌ తెలిపారు.

ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ తరఫున ఆడిన ముస్తాఫిజుర్ వేలి గాయం కారణంగా బంగ్లాదేశ్ తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ బంగ్లాదేశ్ తరఫున 10 టెస్టులు, 27 వన్డేలు ఆడాడు. 24 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు.

Trending News