లీడ్స్: ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో ఆడుతున్న జట్లలో ఆఫ్ఘనిస్థాన్ జట్టును ఓ పసికూనగానే చూశారంతా. కానీ తామేమీ పసికూనలం కాదని సౌతాంప్టన్‌లో జరిగిన 28వ మ్యాచ్‌లో భారత్‌కి గట్టి పోటీ ఇచ్చినప్పడే తమని తాము నిరూపించుకున్నారు ఆఫ్ఘానిస్తాన్ ఆటగాళ్లు. తాజాగా లీడ్స్‌లోని హెడింగ్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘానిస్తాన్ నిర్దేశించిన 228 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు సైతం ఆ జట్టు తమ బౌలింగ్‌తో గట్టి పోటీ ఇచ్చింది. తొలి ఓవర్ రెండో బంతికే ఫఖర్ జమాన్‌ను పెవిలియన్ బాట పట్టించిన ముజీబ్.. ఆ తర్వాత కూడా చాకచక్యంగా బౌలింగ్ చేస్తూ పాకిస్తాన్ ఆటగాళ్లను కట్టడి చేశాడు. మరోవైపు మొహమ్మద్ నబి సైతం ఇమామ్ ఉల్ హఖ్, బాబర్ అజంల వికెట్స్ పడగొట్టాడు. దీంతో పాకిస్తాన్ 121 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత 35 ఓవర్ల వద్ద రషీద్ ఖాన్ బౌలింగ్‌లో హరీస్ సోహైల్ 27 వ్యక్తిగత పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. అప్పటికి జట్టు స్కోర్ 142 పరుగులు మాత్రమే.
38 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోర్ 154/5 కాగా విజయలక్ష్యాన్ని అందుకోవాలంటే 72 బంతుల్లో 74 పరుగులు సాధించాల్సి ఉంది. జట్టు నిలకడగా ఆడుతుందనుకుంటున్న తరుణంలోనే సర్ఫరాజ్ అహ్మెద్ 18 వ్యక్తిగత పరుగులకే ఔట్ అయ్యాడు. అలా 40 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి పాక్ విజయం సాధించడానికి మరో 60 బంతుల్లో ఇంకా 71 పరుగులు అవసరం ఉన్నాయి. అంతకన్నా ముందుగా 10 ఓవర్లలో ఒకే ఒక్క బౌండరీ బాదిన పాకిస్తాన్‌కి ఆఫ్ఘనిస్తాన్ చేతిలో టెన్షన్ పడక తప్పలేదు.
పాక్‌ని టెన్షన్ పెట్టించిన పసికూన ఆఫ్ఘనిస్తాన్