క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మరో భారత క్రికెటర్

క్రికెట్‌కు మరో భారత ఆటగాడు గుడ్ బై

Last Updated : Oct 20, 2018, 04:13 PM IST
క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మరో భారత క్రికెటర్

మరో భారత క్రికెటర్ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. భారత వెటరన్ పేసర్ ప్రవీణ్ కుమార్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశారు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నారు ప్రకటించాడు.

'రిటైర్మెంట్‌పై సుదీర్ఘంగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నా. క్రికెట్ కు  గుడ్ బై చెప్పడానికి ఇదే సరైన సమయమనుకుంటున్నా. క్రికెట్ నాకెంతో ఇచ్చింది. నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చి, ప్రోత్సహించిన నా కుటుంబంతో పాటు బీసీసీఐ, యూపీసీఏ, రాజీవ్ శుక్లా(ఐపీఎల్ ఛైర్మన్)కు ప్రత్యేక ధన్యవాదాలు.' అని ప్రవీణ్ అన్నారు.

11 ఏళ్ల పాటు ప్రవీణ్ కుమార్ అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగారు. ఉత్తర్‌ప్రదేశ్ కు చెందిన ప్రవీణ్ కుమార్ 2007లో నాగ్‌పూర్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌ ద్వారా వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. కెరీర్ లో 68 వన్డేలు, ఆరు టెస్టులు, 10 టీ20 మ్యాచ్‌లు ఆడారు. ఆరు టెస్టుల్లో 27 వికెట్లు, వన్డేల్లో 77 వికెట్లు, టీ20ల్లో 8 వికెట్లు తీశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఏకంగా 119 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. అన్ని సీజన్లలో అద్భుతంగా రాణించి 90 వికెట్లతో సత్తాచాటాడు.

2012 మార్చి 30న దక్షిణాఫ్రికాతో చివరి మ్యాచ్ ఆడాడు. 2011 ప్రపంచ కప్ భారత జట్టుకు ఎంపికైన ప్రవీణ్.. గాయం కారణంగా ప్రపంచ కప్ ఆడే అరుదైన అవకాశాన్ని కోల్పోయారు.

 

Trending News