IPL 2020: అంపైర్ నిర్ణయంపై ప్రీతి జింటా ఆగ్రహం, నిబంధనలు మార్చాల్సిందే

ఆసక్తికరంగా..ఉత్కంఠభరితంగా సాగిన ఐపీఎల్ మ్యాచ్ చర్చనీయాంశమవుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మద్య జరిగిన మ్యాచ్ లో అంపైర్ నిర్ణయంపై టీమ్ యజమాని ప్రీతి జింటా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Last Updated : Sep 21, 2020, 12:33 PM IST
IPL 2020: అంపైర్ నిర్ణయంపై ప్రీతి జింటా ఆగ్రహం, నిబంధనలు మార్చాల్సిందే

ఆసక్తికరంగా..ఉత్కంఠభరితంగా సాగిన ఐపీఎల్ మ్యాచ్ ( IPL Match ) చర్చనీయాంశమవుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Capitals ) , కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మద్య జరిగిన మ్యాచ్ లో అంపైర్ నిర్ణయంపై టీమ్ యజమాని ప్రీతి జింటా ఆగ్రహం వ్యక్తం చేశారు.

క్రికెట్ ప్రేమికులు ఎదురు చూసిన ఐపీఎల్ 2020 లో రెండవ మ్యాచ్ సర్వత్రా ఉత్కంఠత రేపింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ( Kings eleven punjab ) , ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ టై గా ముగియడంతో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది రెండు జట్లకు. చివరికి ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. అయితే సూపర్ ఓవర్ ( Super over ) ఆడాల్సి రావడం వెనుక అంపైర్ తప్పుడు నిర్ణయముందనే విమర్శల వెల్లువెత్తుతున్నాయి.  

అంపైర్ నిర్ణయం పూర్తిగా ( Umpire wrong decision ) తప్పంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. ఛేజింగ్  చేస్తున్న పంజాబ్ జట్టు సూపర్ ఓవర్ కు ముందే విజయం ఖరారు చేసుకోవల్సిన పరిస్థితి. 19వ ఓవర్ లో ఫీల్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం వారి కొంపముంచింది. రబాడ బౌలింగ్ లో 19వ ఓవర్ మూడవబంతిని ఆడిన మయాంక్ ( Mayank ) వాస్తవానికి రెండు పరుగులు తీశాడు. అవతలి ఎండ్ లో ఉన్న క్రిస్ జోర్డాన్ తన బ్యాటును క్రీజ్ లో పెట్టలేదనే కారణంగా లెగ్ అంపైర్ నితిన్ మీనన్ మొత్తం స్కోర్ నుంచి ఒక పరుగును తొలగించారు.  దాంతో మ్యాచ్ టైగా ముగిసింది. ఈ నిర్ణయంపైనే సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంజాబ్ జట్టు యజమాని ప్రీతి జింటా ( Punjab team owner preity zinta ) ట్విట్టర్ సాక్షిగా ఆగ్రహం వ్యక్తం చేశారు.  

కరోనా సోకిన తాను ఆరు రోజుల హోం క్వారంటైన్ ను ఆనందంగా పూర్తి చేసుకున్నా...షార్ట్ రన్ ( Short run ) తనను తీవ్రంగా దెబ్బతీసిందని ప్రీతి జింటా  చెప్పుకొచ్చారు. క్రికెట్ ( Cricket ) లో టెక్నాలజీను వినియోగించుకోలేకపోతే ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. బీసీీసీఐ కొత్త నిబంధనల్ని ప్రవేశపెట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. గెలుపోటముల్ని సమానంగా స్వీకరించే తనకు...అంపైర్ నిర్ణయం మింగుడుపడటం లేదన్నారు. క్రికెట్ నిబంధనల్లో మార్పులు తీసుకురావడం ద్వారా భవిష్యత్ లో మళ్లీ తప్పులు జరగకుండా చూడాలన్నారు. Also read: KXIP Short Run: పంజాబ్ కొంప ముంచిన షార్ట్ రన్.. అంపైర్ల తప్పిదానికి భారీ మూల్యం

 

Trending News