Telugu Titans vs Dabang Delhi: ప్రో కబడ్డీ సీజన్ 8లో తెలుగు టైటాన్స్ ఓటముల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రస్తుత సీజన్ లో ఆ జట్టు కలిసి రావడం లేదు. విజయం వచ్చినట్టే వచ్చి చేజారుతోంది. దబాంగ్ ఢిల్లీ చేతిలోనూ 36-35 తేడాతో తెలుగు టైటాన్స్ ఓటమి చవిచూసింది.
తెలుగు టైటాన్స్ ఆటగాళ్లు రజనీష్ దలాల్ (20 పాయింట్లు) అదరగొట్టగా.. సురీందర్ 4, బెనీవాల్ 3.. రోహిత్ కుమార్, సందీప్ చెరో పాయింట్ సాధించారు. దబాంగ్ దిల్లీ నుంచి నవీన్ కుమార్ (25) రాణించాడు.
ప్రత్యర్థి జట్టులో మన్‌జీత్ ఛిల్లర్ 2.. జీవ కుమార్, విజయ్ మాలిక్, అషు మాలిక్, జోగిందర్, క్రిషన్ ఒక్కో పాయింట్ సంపాదించారు. తెలుగు టైటాన్స్ పై విజయంతో దబాంగ్ ఢిల్లీ (26) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. తెలుగు టైటాన్స్ నాలుగో ఓటమిని తన ఖాతాలో వేసుకుంది.
WHAT A HEARTBREAK FOR THE TITANS 🤯
Another Naveen Express special as @DabangDelhiKC storm through to claim the 🔝 spot on the points table! 🚆#DELvTT #vivoProKabaddi pic.twitter.com/JjG4nXqcXg
— ProKabaddi (@ProKabaddi) January 5, 2022
గుజరాత్ పై పుణె విజయం
మరో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ మీద పునెరి పల్టాన్ 26-33 పాయింట్లతో ఘన విజయం సాధించింది. పునెరి పల్టాన్ నుంచి మోహిత్ 10, ఇనామ్‌దార్ 8, విశ్వాస్ 3.. నాదరాజన్, సావంత్, బల్‌దేవ్ సింగ్, విశాల్ భరద్వాజ్ తలో పాయింట్ సాధించారు. గుజరాత్ జెయింట్స్ ఆటగాళ్లు అజయ్ కుమార్ 10, రాకేశ్ 8, పర్వేష్ 4, సునీల్ కుమార్ 2.. రవీందర్, రాకేశ్ చెరో పాయింట్ తెచ్చారు.
Also Read:IND vs SA: ముగిసిన మూడో రోజు ఆట.. విజయానికి చేరువలో దక్షిణాఫ్రికా! ఇంకా 122 పరుగులే!!
Also Read: Bhanuka Rajapaksa Retires: చిన్న వయసులోనే శ్రీలంక బ్యాటర్ రిటైర్మెంట్- లంక క్రికెట్ బోర్డే కారణం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.