Rafael Nadal tests positive: స్టార్ టెన్నిస్ ప్లేయర్ రాఫెల్ నాదల్(Rafael Nadal)కు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అబుదాబిలో జరిగిన ఎగ్జిబిషన్ ఈవెంట్(Abu Dhabi event)లో ఆడిన రాఫెల్ ఇటీవల గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చాడు. తాజాగా తనకు కరోనా(Covid-19) సోకినట్లు ఈ దిగ్గజ ఆటగాడు వెల్లడించాడు. ఈ నేపథ్యంలో.. త్వరలో ప్రారంభంకానున్న ఆస్ట్రేలియా ఓపెన్(Australian Open)లో ఆడతాడా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
'నేను కొన్ని బాధాకరమైన క్షణాలను కలిగి ఉన్నాను. దీంట్లో నుంచి మెరుగుపడతానని ఆశిస్తున్నాను. నేను ఇప్పుడు స్వదేశానికి చేరుకున్నాను. నాతో సన్నిహితంగా మెలిగిన వారందరూ..దయచేసి కొవిడ్ పరీక్షలు చేయించుకోండి' అని నాదల్ ఒక ప్రకటనలో తెలిపారు.
Hola a todos. Quería anunciaros que en mi regreso a casa tras disputar el torneo de Abu Dhabi, he dado positivo por COVID en la prueba PCR que se me ha realizado al llegar a España.
— Rafa Nadal (@RafaelNadal) December 20, 2021
Also Read: Peng Shuai: నాపై లైంగిక దాడి జరగలేదు.. యూటర్న్ తీసుకున్న టెన్నిస్ స్టార్!!
నాదల్..ఆగస్టులో వాషింగ్టన్ లో జరిగిన మ్యాచ్ లో లాయిడ్ హారిస్(Lloyd Harris) చేతిలో ఓడిపోయాడు. అనంతరం నాలుగు నెలల తర్వాత కోర్టులో అడుగుపెట్టాడు నాదల్. అబుదాబిలో జరిగిన ఎగ్జిబిషన్ టోర్నమెంట్‌లో ఆండీ ముర్రే(Andy Murray) చేతిలో వరుస సెట్లలో ఓడిపోయాడు. వింబుల్డన్, టోక్యో ఒలింపిక్స్, యూఎస్ ఓపెన్‌లకు నాదల్ దూరమయ్యాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook