IND vs SL 1st Test, Ravindra Jadeja Record: మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ 222 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకు ఆలౌట్ అయిన లంక.. 400 పరుగుల లోటుతో ఫాలోఆన్ ఆడి రెండో ఇన్నింగ్స్‌లోనూ 178 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ విజయంలో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. ముందుగా బ్యాట్‌తో (175 నాటౌట్; 228 బంతుల్లో 17×4,3×6) భారీ సెంచరీ చేయగా.. ఆపై బంతితోనూ లంకను బెంబేలెత్తించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టి లంక బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు.
ఆల్‌రౌండ్ షోతో దుమ్మురేపిన 'సర్' రవీంద్ర జడేజా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక టెస్ట్ మ్యాచ్‌లో 150కి పైగా రన్స్, ఐదు వికెట్లు తీసిన మూడో భారత ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. 1952లో వినూ మాన్కడ్ ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో 184 పరుగులు.. ఐదు వికెట్లు తీశాడు. 1962లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో పాలి ఉమ్రిగర్ 172 రన్స్, ఐదు వికెట్లు పడగొట్టాడు. తాజాగా ఈ జాబితాలో సర్ జడేజా చేరాడు. ఉమ్రిగర్ తర్వాత గత 60 ఏళ్లలో మరో భారత ప్లేయర్ ఈ ఘనతను అందుకోలేదు.
ఓవరాల్‌గా ఒక టెస్ట్ మ్యాచ్‌లో 150కి పైగా పరుగులు, ఐదు వికెట్లు తీసిన జాబితాలో రవీంద్ర జడేజా ఆరో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో వినూ మాన్కడ్, డెనిస్ అట్‌కిన్సన్, పాలి ఉమ్రిగర్, గ్యారీ సోబర్స్, ముస్తాక్ మహ్మద్, రవీంద్ర జడేజాలు ఉన్నారు. జడేజా చివరిసారిగా 2017లో ఐదు వికెట్ల హాల్ అందుకున్నాడు. అప్పుడు కూడా ప్రత్యర్థి శ్రీలంకనే కావడం విశేషం. కొలంబో వేదికగా జరిగిన ఆ టెస్టులో జడ్డు 152 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. జడేజాకు టెస్టుల్లో ఇది పదో ఐదు వికెట్ల హాల్.
అంతకుముందు భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ రికార్డును సర్ జడేజా బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన తొలి ఆటగాడిగా జడ్డు నిలిచాడు. అంతకుముందు కపిల్ దేవ్ పేరుపై ఈ రికార్డు ఉంది. 1986లో శ్రీలంకపై 7వ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి,న కపిల్.. 163 పరుగులు చేశారు. ఈ జాబితాలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 159 పరుగులతో మూడో స్ధానంలో ఉన్నాడు.
Also Read: పెట్రోల్ బంక్‌లో ఘరానా మోసం... డీజిల్‌లో నీళ్లు కలిపి అమ్ముతున్న వైనం.. ఎక్కడంటే..
Also Read: Radhe Shyam First Review: రాధేశ్యామ్ రివ్యూ.. భారత్‌లో ప్రభాస్‌ను బీట్ చేసేవాళ్లే లేరు!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook