Rohit Sharma: రెండో టెస్టుకు రోహిత్‌ శర్మ దూరం.. ఓపెనర్లుగా వాళ్లిద్దరే!

India Captain Rohit Sharma miss 2nd test against Bangladesh. బంగ్లాదేశ్‌తో ఢాకా వేదికగా డిసెంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 19, 2022, 02:50 PM IST
  • రెండో టెస్టుకు రోహిత్‌ శర్మ దూరం
  • ఓపెనర్లుగా వాళ్లిద్దరే
  • డిసెంబర్ 22 నుంచి రెండో టెస్టు ప్రారంభం
Rohit Sharma: రెండో టెస్టుకు రోహిత్‌ శర్మ దూరం.. ఓపెనర్లుగా వాళ్లిద్దరే!

Rohit Sharma ruled out from 2nd Test vs Bangladesh due to Injury: బంగ్లాదేశ్‌తో ఢాకా వేదికగా డిసెంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టుకు ముందు టీమిండియా భారీ షాక్ తగిలింది. భారత క్రికెట్ జట్టు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ రెండో టెస్టుకు దూరమయ్యాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో బొటన వేలికి అయిన గాయం తగ్గకపోవడంతో హిట్‌మ్యాన్ రెండో టెస్టు నుంచి తప్పుకున్నాడు. గురువారం రెండో టెస్టు ప్రారంభమయ్యే సమయానికి రోహిత్ ఫిట్‌గా ఉంటాడని అనుకున్నా.. అది కుదరలేదు. విషయం తెలిసిన హిట్‌మ్యాన్ ఫాన్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు. 

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ కెప్టెన్ రోహిత్ శర్మ బొటన వేలికి గాయం అయింది. స్లిప్స్‌లో క్యాచ్ అందుకోవడానికి ప్రయత్నించగా.. హిట్‌మ్యాన్ బొటన వేలికి దెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆ మ్యాచులో రోహిత్ జట్టు కోసం 9వ స్థానంలో బరిలోకి దిగి హాఫ్ సెంచరీ బాదాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో మూడో వన్డేతో పాటు తొలి టెస్టుకు దూరమయ్యాడు. రెండో టెస్ట్ ప్రారంభమయ్యే సమయానికి రోహిత్ ఫిట్‌గా ఉంటాడని బీసీసీఐ భావించినా.. గాయం తీవ్రత ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఇప్పటికే మొదటి టెస్ట్ గెలిచినందున అతడిని ఆడించి రిస్క్ చేయకూడదని మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుందట. 

గాయపడ్డ భారత జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్వదేశానికి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. దాంతో బంగ్లాతో మొదటి టెస్టులో యువ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 20 పరుగులు చేసిన గిల్‌.. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగాడు. 152 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 110 పరుగులు బాదాడు. టీమిండియా భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు లైన్ క్లియర్ అవడంతో గిల్ ఆడడం ఖాయం అయింది. 

Also Read: మందార టీ ఆరోగ్యానికి ఓ వరం.. చలికాలంలో తాగితే అద్భుతమైన ప్రయోజనాలు! 6 ప్రయోజనాలు ఇవే 

Also Read: రూపాయి కాయిన్‌లతోనే.. 2.85 లక్షల విలువైన కేటీఎం బైక్ కొన్న తెలంగాణ యువకుడు! షాకింగ్ వీడియో మీ కోసం  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News