RONALDO: చనిపోయిన కొడుక్కు రోనాల్డో వందో గోల్ అంకితం

RONALDO: రొనాల్డోకు 100వ గోల్  కావడంతో గోల్ చేసిన తరువాత రొనాల్డో తన చేతి వేలును అకాశం వైపు చూపిస్తూ తన కుమారుడిని స్మరించుకున్నాడు. ఈ ఉద్వేగ సంఘటనకు సంబందించిన వీడియో ఇప్పుడు   సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Last Updated : Apr 24, 2022, 09:59 PM IST
  • 100గోల్ చేసిన రోనాల్డో
  • తన కొడుక్కు అంకితం
  • వైరల్ అవుతున్న రోనాల్డో ఉద్వేగ వీడియో
RONALDO: చనిపోయిన కొడుక్కు రోనాల్డో వందో గోల్ అంకితం

RONALDO: ప్రముఖ ఫుట్ బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో  రొనాల్డో  తన వందో గోల్ ను ఇటీవల మరణించిన తన నవజాత కుమారుడికి అంకితం ఇస్తూ నివాళులు అర్పించాడు. శనివారం ప్రీమియర్ లీగ్ లోభాగంగా ఆర్సెనల్ తో జరిగిన మ్యాచ్లో ౩4 నిముషంలో గోల్ చేశాడు. ఇ గోల్ రొనాల్డోకు 100వ గోల్  కావడంతో గోల్ చేసిన తరువాత రొనాల్డో తన చేతి వేలును అకాశం వైపు చూపిస్తూ తన కుమారుడిని స్మరించుకున్నాడు. ఈ ఉద్వేగ సంఘటనకు సంబందించిన వీడియో ఇప్పుడు   సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రీమియర్ లీగ్ చరిత్రలో రొనాల్డో తప్ప ఏ ఫుట్ బాల్ ప్లేయర్ ఈ ఘనతను సాధించలేదు.  ఈమ్యాచ్ లో మాంచెస్టర్ యూనైటెడ్ 3-1 తేడాతో ఓటమి పాలైంది. 

జార్జినా- రొనాల్డో దంపతులకు ఇప్పటికే నలుగురు పిల్లలు ఉన్నారు. మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారుని అందులోను కవలపిల్లలు పుట్టబోతున్నారని గత అక్టోబర్ ఈజంట సోషల్ మీడియా ద్వారా తెలిపింది. కానీ గత వారంలో  రొనాల్డోకు కవల పిల్లలు జన్మించారు. కవలలో ఒక పాప,ఒక బాబు జన్మించాడు. కానీ బాబు పుట్టిన వెంటనే మరణించడంతో రొనాల్డో ఇంట విషాదం నెలకొంది. ఇ విషయాన్ని రొనాల్డో సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేశాడు. "అప్పుడే పుట్టిన మా బాబు చనిపోయిన విషయం మీతో పంచుకుంటున్నందుకు చాలా బాధగా ఉంది. ఏ తల్లిదండ్రులకైనా ఇది భరించలేని విషాదం. పాప బతికి ఉండడం మాకు కొంత ఆశ, అనందాన్ని ఇవ్వగలదు. మా బాబును బతికించడానికి ప్రయత్నం చేసిన డాక్టర్లు, నర్సులకు ధన్యవాదాలు. ఇటువంటి క్లిష్టసమయంలో మా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని రొనాల్డో ఉద్వేగపూరితమైన పోస్టును షేర్ చేశాడు. 

Also Read : SRH Team New Song: కేన్ అండ్ కో 'ఐ లవ్ బిర్యానీ సాంగ్'.. వైరల్ అవుతున్న సన్ రైజర్స్ సాంగ్..

Also Read : Ram Charan Upasana: చిరంజీవి అంటే భయమా లేదా ఉపాసననా.. తెలివైన సమాధానం ఇచ్చిన రామ్ చరణ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News