తన పెళ్లి తేదీని ప్రకటించిన బ్యాడ్మింటన్ స్టార్

తన పెళ్లి తేదీని ప్రకటించిన బ్యాడ్మింటన్ స్టార్

Updated: Oct 8, 2018, 03:54 PM IST
తన పెళ్లి తేదీని ప్రకటించిన బ్యాడ్మింటన్ స్టార్

బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌లు ప్రేమించుకుంటున్నారని.. వీరి పెళ్లి త్వరలో జరగనుందని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై  సైనా తొలిసారి స్పందించారు. తాను, కశ్యప్‌ ప్రేమించుకుంటున్నట్లు చెప్పారు. అంతేకాదు.. పెళ్లి డేట్ కూడా కన్ఫామ్‌ చేసినట్లు చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ 16న తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు సైనా స్పష్టం చేశారు.

తాను డిసెంబర్ 20 తర్వాత ప్రిమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌, ఆ తర్వాత టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌లలో బిజీగా ఉంటాను కాబట్టే డిసెంబర్ 16న పెళ్లి చేసుకుంటున్నానన్నారు.   

తనకు, పారుపల్లి కశ్యప్‌‌లకు మధ్య ఉన్న సంబంధాన్ని ఆమె ఈ సందర్భంగా వివరించారు. ‘2005 నుంచి మేమిద్దరం గోపిచంద్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్నాం. 2007లోనే మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచే ఇద్దరం టోర్నీలకు కలిసి వెళ్లాం.. ఆడాము. ఈ క్రమంలోనే మా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది' అని సైనా చెప్పారు.  

‘మా ఇద్దరి దృష్టిలో టోర్నీలు గెలవడం చాలా ముఖ్యం. అందుకే వేచి ఉన్నాం. కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు పూర్తయ్యే వరకు పెళ్లి వద్దనుకున్నాం. ఇప్పుడు అందుకు సమయం వచ్చింది’ అని సైనా వివరించారు. ఈ విషయం మీ పేరెంట్స్‌కి చెప్పారా? అని అడగ్గా.. తమ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడానికి పెద్దగా కష్టపడలేదని అన్నారు.