నగ్నంగా వికెట్ కీపింగ్ చేస్తున్న మహిళా క్రికెటర్ !

ఇంగ్లాండ్‌ మహిళా క్రికెటర్‌ సారా టేలర్‌  సంచలనం సృష్టించింది.  

Last Updated : Aug 14, 2019, 08:22 PM IST
నగ్నంగా వికెట్ కీపింగ్ చేస్తున్న మహిళా క్రికెటర్ !

ఇంగ్లాండ్‌ మహిళా క్రికెటర్‌ సారా టేలర్‌  ఎవరూ చేయని సాహసం చేసింది. నగ్నంగా వికెట్ కీపింగ్ చేస్తున్న చిత్రాన్ని తన ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేసి అందరినీ  ఆశ్చర్యంలో ముంచెత్తింది. అదేమంటే మహిళల శరీరం, ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించేందుకే ఇలా సరికొత్త ప్రయోగం చేశానని సారా చెబుతోంది.

ఉమెన్స్‌హెల్త్‌ యూకే  ఆధ్వరంలో మహిళల దేహానికి సంబంధించిన సమస్యలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఇందులో  అతిథిగా హాజరైన సారా టేలర్‌  తన అనుభవాలను  అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా సారా టేలర్‌ మాట్లాడుతూ తన దేహంతో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నానని... అయితే వాటిని అధిగమించి.... మహిళా సాధికారతను సాధించానని తెలిపింది. నిజం చెప్పాలంటే  '' చూసేందుకు ప్రతీ అమ్మాయి అందమైందే '' అని పేర్కొన్న సారా టేలర్‌ తన నగ్ర చిత్రానికి వివరణ ఇచ్చింది.

ఇంగ్లండ్ మహిళ జట్టుకు ఆమె వికెట్ కీపర్ గా వ్యవహరిస్తున్న సారా టేలర్... 17 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్ లో అడుపెట్టి అంత్యంత యంగ్ మహిళా క్రికెటర్ గా గుర్తింపు పొందింది. అలా కెరీస్ ప్రారంభించిన ఆమె వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తునే బ్యాటింగ్ లో అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇస్తోంది. దూకుడైన ఆటతీరుతో  19 ఏళ్ల కే  1000 పరుగులు పూర్తి చేసుకున్న మహిళా క్రికెటర్ గా ఘనత సాధించింది. ఆమె గురించి చెప్పాలంటే అద్భుతమైన వికెట్‌ కీపింగ్‌ నైపుణ్యాలు ఆమె సొంతం. బ్యాటింగ్‌లోనూ సారాకు తిరుగులేదు. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో మిథాలీ సేనకు ఓటమి రుచి చూపించింది ఆమే. ఒక్క ఆటతోనే కాదు అందంతో కూడా ఆమె అభిమానులను ఇలా కట్టిపడేస్తుంది సారా టేలర్.
 

Trending News