విమర్శకులకు ఘాటైన జవాబిచ్చిన శిఖర్ ధవన్

విమర్శకులకు ఘాటైన జవాబిచ్చిన శిఖర్ ధవన్

Updated: Mar 11, 2019, 07:54 PM IST
విమర్శకులకు ఘాటైన జవాబిచ్చిన శిఖర్ ధవన్
Image Courtesy: Twitter/@BCCI

మొహాలి: గత ఆరు నెలల్లో అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఒక్క సెంచరీ కూడా చేయని శిఖర్ ధవన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇక ధవన్ పని అయిపోట్టేననే కామెంట్స్ కూడా వినిపించాయి. కానీ విమర్శకులకు అందరికీ ధవన్ తిరిగి తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. ఆదివారం మొహాలిలో ఆస్ట్రేలియాతో జరిగిన 4వ వన్డేలో ఆసిస్ బౌలర్లపై శిఖర్ ధవన్ చెలరేగిపోయాడు. 143 పరుగులు చేసి తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రతిభ కనబర్చాడు. 

ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన శిఖర్ ధవన్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. తాను విమర్శలకు స్పందించనని అన్నాడు. తన ప్రపంచంలో తానుండటం వల్ల మనస్సును ప్రశాంతంగానే ఉంచుకోగలనని ధవన్ స్పష్టంచేశాడు. మొదటిగా తనకు పత్రికలు చదివే అలవాటు లేదు. తనకు అనవసరమైన విషయాలు తెలుసుకోవాలనే కోరిక ఉండదు. అందుకే లోకం తన గురించి ఏమనుకున్నా తనకు సంబంధం లేదు అని బదులిచ్చాడు.