Team India: టీమ్ ఇండియా బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ ప్రపంచ రికార్డు

Team India: టీమ్ ఇండియా బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ విజృంభణ కొనసాగుతోంది. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఆ వివరాలు ఇలా

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 28, 2022, 11:32 PM IST
Team India: టీమ్ ఇండియా బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ ప్రపంచ రికార్డు

Team India: టీమ్ ఇండియా బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ విజృంభణ కొనసాగుతోంది. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఆ వివరాలు ఇలా

తిరువనంతపురం వేదికగా ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఇండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ మరోసారి చెలరేగి ఆడాడు. రెండు రికార్డులు నెలకొల్పాడు. ఇందులో ఒకటి ప్రపంచ రికార్డు కావడం విశేషం.

ఇవాళ జరిగిన టీ20 మ్యాచ్‌లో సూర్య కుమార్ యాదవ్ చెలరేగి ఆడి..33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. ఒకే క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక పరుగులు అంటే 732 చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఇంతకుముందు శిఖర్ ధావన్ 689 పరుగులు, విరాట్ కోహ్లి 641 పరుగులు సాధించారు. మరోవైపు ఇదే మ్యాచ్‌లో 3 సిక్సర్లు కొట్టిన సూర్య కుమార్ యాదవ్ ఒకే క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక సిక్సర్లు 45 కొట్టడం ద్వారా ప్రపంచ రికార్డు సాధించాడు. గతంలో ఈ రికార్డు పాకిస్తాన్ బ్యాటర్ రిజ్వాన్ 2021లో 42 సిక్సర్లు సాధించగా..అంతకుముందు గప్తిల్ 41 సిక్సర్లు కొట్టాడు.

Also read: Ind vs SA: దక్షిణాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్‌లో ఇండియా ఘన విజయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News