Sunil Gavaskar Feels Ex Captain MS Dhoni to become India head coach: భారత గడ్డపై ఐపీఎల్ 2023 రసవత్తరంగా సాగుతోంది. లీగ్ దశ ముగింపుకు వచ్చేసింది. ఈ సంవత్సరం అద్భుతమైన ప్రదర్శనను ఇచ్చిన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సారథ్యంలో చెన్నై దూసుకుపోతోంది. ఇప్పటివరకు చెన్నై 10 మ్యాచ్‌లల్లో 5 విజయాలను సాధించింది. వర్షం వల్ల లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్ రద్దయింది. దాంతో మొత్తం 11 పాయింట్లతో ప్రస్తుతం ఐపీఎల్ 2023 పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. మరో రెండు విజయాలు సాదించినా చెన్నై ప్లే ఆఫ్స్ వెళ్లే అవకాశాలు ఉంటాయి.
ఐపీఎల్ మొత్తంలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ ముందువరుసలో ఉన్నాడు. తాను సారథ్యం వహిస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టును సెకెండ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్‌గా నిలిపాడు. ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యం వహిస్తోన్న ముంబై ఇండియన్స్ 5 టైటిల్స్ గెలవగా.. చెన్నై ఖాతాలో 4 ఉన్నాయి. కేవలం చెన్నైని మాత్రమే కాదు టీమిండియాను కూడా విజయ పథంలో నడిపించాడు ఎంఎస్ ధోనీ. మంచి ట్రాక్ రికార్డు ఉన్న ధోనీ.. టీమిండియా హెడ్ కోచ్‌గా రావాలని అందరూ అభిప్రాయపడుతున్నారు. టీమిండియా హెడ్ కోచ్‌గా అతడిని నియమించే అవకాశాలను బీసీసీఐ పరిశీలిస్తోందనే వార్తలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఐపీఎల్ నుంచి కూడా రిటైర్ అయిన తరువాత ధోనీకి ఈ బాధ్యతలను అప్పగించే అవకాశాలు ఉన్నాయని మాజీలు అంటున్నారు. ఇదే విషయంపై టీమిండియా మాజీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ కూడా హింట్ ఇచ్చాడు.
స్టార్ స్పోర్ట్స్‌తో జరిగిన ఇంటరాక్షన్‌లో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ... 'ఎంఎస్ ధోనీ త్వరలోనే టీమిండియాకు కోచ్‌గా భాద్యత చేపట్టవచ్చు. అది జరగాలని నేను అనుకుంటున్నాను. టీమ్‌తో ఏదైనా అసైన్‌మెంట్ తీసుకునే ముందు (ప్లేయర్‌గా రిటైర్ అయిన తర్వాత) కొంచెం కూలింగ్ ఆఫ్ పీరియడ్ అవసరమని నేను నమ్ముతున్నాను. అది సెలక్షన్ కమిటీ అయినా, మేనేజర్ అయినా లేదా కోచ్ అయినా 2 లేదా 3 సంవత్సరాల కూలింగ్ ఆఫ్ పీరియడ్ అవసరమని నేను భావిస్తున్నా. ఎవరికైనా మూడేళ్ళ కూలింగ్-ఆఫ్ పీరియడ్ ఇవ్వవచ్చు' అని అన్నాడు.
'ఎంఎస్ ధోనీకి బీసీసీఐలో కీలకమైన పదవి దక్కుతుంది. అది సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ కావొచ్చు, టీమ్ హెడ్ కోచ్ కావొచ్చు లేదా కోచింగ్ స్టాఫ్ హెడ్ కావొచ్చు. వచ్చే 2-3 సంవత్సరాల్లో బీసీసీఐలో ధోనీ కీలక పాత్ర పోషించడం ఖాయమని నేను నమ్ముతున్నా. మహీ విలువైన సూచనలు, సలహాలు, నాయకత్వ పటిమ జట్టుకు చాలా అవసరం. ధోనీ అనుభవం భారత్‌లో వర్ధమాన క్రికెటర్లకు ఉజ్వల భవిష్యత్‌ను చూపుతుంది. అంతేకాదు టీమిండియా ఆధిపత్యాన్ని సుస్థిరం చేస్తుంది' అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. ధోనీ ఇదివరకు టీమిండియాకు మెంటార్‌గా సేవలను అందించిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ 2021 ఆడిన భారత జట్టుకు మెంటార్‌గా పని చేశాడు. అప్పుడు భారత్ సెమీ ఫైనల్స్ వరకు వెళ్లింది.
Also Read: Toyota Hyryder Price Hike 2023: 60 వేలు పెరిగిన టయోటా హైరైడర్ ధర.. కొత్త ధరల జాబితా ఇదే!
Also Read: 2023 Budget SUVs: 10 లక్షల లోపు 8 ఎస్‌యూవీలు.. పంచ్, నెక్సాన్, బ్రెజాతో సహా కార్ల జాబితా ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.