India Vs Australia 3rd ODI Preview: సిరీస్ ఫలితాన్ని తేల్చే కీలక పోరుకు రంగం సిద్ధమైంది. మూడో వన్డేలో భాగంగా.. ఇవాళ చెన్నైలో ఆస్ట్రేలియాను టీమిండియా ఢీకొట్టబోతుంది. రెండో వన్డేలో ఘోరంగా ఓడిపోయిన భారత్ ఈ మ్యాచ్ లో ఎలా రాణిస్తోందో చూడాలి. తొలి వన్డేలో అతికష్టం మీద నెగ్గిన రోహిత్ సేన.. రెండో వన్డేలో పూర్తిగా విఫలమైంది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. ఎలాగైనా సిరీస్ ను చేజిక్కించుకోవాలని రెండు జట్లు నెట్ లో చెమటడోస్తున్నాయి. ఈ మ్యాచ్ చెపాక్ మైదానంలో మధ్యాహ్నం 1:30 నుంచి జరగనుంది.
భారత బ్యాటింగ్ విషయానికొస్తే.. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ వంటి బలమైన టాప్‌ఆర్డర్ ఉన్నప్పటికీ వారు ఈ సిరీస్ లో అంచనాలకు తగ్గట్టు ఆడలేకపోయారు. సూర్య అయితే ఘోరంగా విఫలమవుతున్నాడు. టీ20ల్లోనే కాదు.. వన్డేల్లోనూ కూడా రాణించగలనని సూర్య నిరూపించాలి. ముఖ్యంగా స్టార్క్ ను ఎదుర్కోనడంలో సూర్య, గిల్ ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు కెప్టెన్ రోహిత్, స్టార్ బ్యాటర్ కోహ్లీ తమ స్థాయికు తగ్గట్లు రాణించాల్సి ఉంది. ఆల్ రౌండర్లగా హార్దిక్ పాండ్య, జడేజా కూడా తమ పాత్రకు న్యాయం చేయాలి.
మరోవైపు గత మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు అందరూ తేలిపోయారు. షమి, సిరాజ్ , జడేజా మిగతా బౌలర్లు అందరూ రాణించాల్సి ఉంది. మిచెల్ మార్ష్‌ను కట్టడి చేయడంలోనూ భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. గాయంతో దూరమైన స్టార్ ఆటగాడు వార్నర్ ఈ మ్యాచ్ లో బరిలో దిగే అవకాశం ఉంది. ఇప్పటికే మార్ష్ సూపర్ ఫామ్ లో ఉండగా.. హెడ్ కూడా రాణిస్తున్నాడు. చెపాక్ పిచ్ స్పిన్ కు అనుకూలించే అవకాశం ఉంది.
భారత్ తుది జట్టు అంచనా: భారత్: రోహిత్ శర్మ (c), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, KL రాహుల్ (WK), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్/వాషింగ్టన్ సుందర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.
Also Read: IPL 2023: ఐపీఎల్ ప్రారంభానికి ముందు షాకింగ్ న్యూస్.. స్టార్ ప్లేయర్ ఔట్
Also Read: Rohit Sharma-Virat Kohli: కేవలం 2 రన్స్ మాత్రమే.. ప్రపంచ రికార్డు నెలకొల్పనున్న రోహిత్-కోహ్లీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి