వెస్టిండీస్‌తో 3వ టీ20లో ఉమేష్, బుమ్రా, కుల్దీప్‌లకు విశ్రాంతి.. జట్టు వివరాలివే.!

వెస్టిండీస్‌తో జరిగిన రెండు టీ20ల్లో కూడా ఆ జట్టును ఓడించిన భారత్ మూడో టీ20కి సంబంధించి జట్టులో మార్పులు చేయబోతోంది. 

Last Updated : Nov 9, 2018, 12:28 PM IST
వెస్టిండీస్‌తో 3వ టీ20లో ఉమేష్, బుమ్రా, కుల్దీప్‌లకు విశ్రాంతి.. జట్టు వివరాలివే.!

వెస్టిండీస్‌తో జరిగిన రెండు టీ20ల్లో కూడా ఆ జట్టును ఓడించిన భారత్ మూడో టీ20కి సంబంధించి జట్టులో మార్పులు చేయబోతోంది. బౌలర్లు ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బూమ్రా, కుల్దీప్ యాదవ్‌లకు విశ్రాంతి ఇవ్వనుంది. ఈ మేరకు బీసీసీఐ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఆస్ట్రేలియా టూర్‌లో మంచి ఫిట్నెస్‌తో ఉన్న బౌలర్లతో బరిలో దిగేందుకు టీమిండియా సిద్ధమవుతుంది కాబట్టి.. అందుకు అనుగుణంగానే జట్టులో మార్పులు చేసినట్లు బీసీసీఐ తెలిపింది.

తాజాగా వెస్టిండీస్‌తో జరగబోయే 3వ టీ20లో పంజాబ్‌కి చెందిన మీడియం పేస్ బౌలర్ సిద్దార్ధ్ కౌల్‌కి అవకాశం ఇవ్వనున్నారు. రెండవ టీ20లో రోహిత్ శర్మ తన సూపర్ డూపర్ సెంచరీతో జట్టుకి విజయాన్ని కట్టబెట్టిన సంగతి తెలిసిందే. అలాగే మన బౌలర్లు కూడా బాగా రాణించారు. 

3వ టీ20లో భారత జట్టు వివరాలు ఇవే: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), మనీష్ పాండే, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), క్రునాల్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, షహబాజ్ నదీమ్, సిద్ధార్ధ్ కౌల్

Trending News