Venkatesh Iyer: T20 ప్రపంచ కప్ 2022 సెమీ ఫైనల్లో టీమిండియా ఓటమి తరువాత బీసీసీఐ ప్రక్షాళన చేపడుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే వరల్డ్ కప్ స్వదేశంలో జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేస్తోంది. టీ20ల నుంచి సీనియర్లకు విశ్రాంతిని ఇచ్చి.. వన్డేలపై ఎక్కువ ఫోకస్ పెట్టేలా ప్లాన్ చేస్తోంది. అయితే న్యూజిలాండ్ టూర్‌కు కొంతమంది సీనియర్లకు రెస్ట్ ఇచ్చింది.
కివీస్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు టీమ్ ఇండియా సన్నాహాలు ప్రారంభించింది. ఈ టూర్ కోసం భారత ఆటగాళ్లు న్యూజిలాండ్ చేరుకున్నారు. స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా టీ20 టీమ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. పాండ్యా గాయం నుంచి కోలుకుని వచ్చిన తరువాత తన ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. ముఖ్యంగా ఈ ఏడాది ఐపీఎల్‌లో తన జట్టు గుజరాత్ టైటాన్స్‌ను కెప్టెన్‌గా ముందుండి నడిపించి కప్ అందించాడు. టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చి తన పర్ఫామెన్స్‌తో అందరినీ మెస్మరైజ్ చేస్తున్నాడు. సీనియర్లకు విశ్రాంతి నేపథ్యంలోనే టీమిండియా కెప్టెన్‌గా అవకాశం అందుకున్నాడు.
అయితే పాండ్యా జట్టులోకి తిరిగి వచ్చిన తరువాత మరో యువ ఆల్‌రౌండర్ వెంకటేష్ అయ్యర్ పేరు . ఐపీఎల్ 2022 తర్వాత వెంకటేష్ అయ్యర్ టీం ఇండియా తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. వెంకటేష్ అయ్యర్ కూడా హార్దిక్ పాండ్యా లాగా భారీ హిట్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అయితే హార్దిక్ పాండ్యా అద్భుతమైన ప్రదర్శనతో అతనికి జట్టులో అవకాశం దక్కలేదు.
హార్దిక్ పాండ్యా గాయం కారణంగా టీ20 ప్రపంచకప్ 2021 నుంచి టీమ్ ఇండియాకు దూరమయ్యాడు. ఆ టైమ్‌లో పాండ్యాకు బదులుగా వెంకటేష్ అయ్యర్ టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయ్యర్ కొన్ని మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శనే ఇచ్చాడు. అయ్యర్ కుదురుకుంటే హర్ధిక్ పాండ్యాకు గట్టి పోటీగా మారతాడని అందరూ భావించారు. కానీ ఈ ఏడాది ఐపీఎల్‌లో అయ్యర్ ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో అతని దారులు మూసుకుపోయాయి. అదే సమయంలో పాండ్యా ఐపీఎల్ కప్‌ను తన జట్టుకు అందించి.. టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు.
వెంకటేష్ అయ్యర్ టీమిండియా తరపున 9 టీ20 మ్యాచ్‌లు ఆడి 133 పరుగులు చేసి 5 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ తరువాత దక్షిణాఫ్రికా, ఐర్లాండ్ సిరీస్‌లకు ఎంపికైనా.. ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం దక్కలేదు. ఇక న్యూజిలాండ్ టూర్‌కు ఈ యువ ఆటగాడిని సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. అయితే భవిష్యత్‌లో మళ్లీ కచ్చితంగా అయ్యర్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇటు బ్యాటింగ్‌తో పాటు.. అటు బౌలింగ్‌లోనూ రాణించగల సత్తా ఉంది.
Also Read: Delhi MCD Elections: టికెట్ దక్కలేదని టవర్ ఎక్కిన ఆప్ నాయకుడు.. వినూత్న నిరసన
Also Read: Yadadri: యాదాద్రి ఆలయానికి రికార్డు స్థాయి ఆదాయం.. చరిత్రలో తొలిసారి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి