close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

అందరికీ సుపరిచితుడైన ఈ చిచ్చర పిడుగు ఎవరో గుర్తుపట్టారా ?

ఈ ఫోటోలో ఉన్న ఫేస్ ను ఎక్కడో చూసినట్లుగా ఉంది కదూ... 

Updated: Jun 18, 2019, 03:47 PM IST
అందరికీ సుపరిచితుడైన ఈ చిచ్చర పిడుగు ఎవరో గుర్తుపట్టారా ?

ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నోడు ఎవరో గుర్తు పట్టారా ? గుర్తుపట్టలేకపోతున్నారా..కాస్త సూక్ష్మంగా పరిశీలించండి...ఇతను అందరికీ సూపరిచితుడే.. ఎక్కడో చూసినట్లు ఉంది కదూ.. అయినా గుర్తుకు రావడం లేదా ? అయితే వివరాల్లోకి వెళ్లండి మీరే అర్థమౌతుంది.

అదేనండి ఇతను మన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కదూ... విరాట్ తన ఇప్పటి  ఫోటో ఫోజు... తన చిన్ననాటి ఫోటో ఫోజుతో జత చేసి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ఈ ఫోటో పోస్ట్ చేసి కోహ్లీ ఏమన్నాడంటే..  అప్పటికీ.. ఇప్పటికీ తనలో ఎలాంటి మార్పురాలేదని  చమత్కరించాడు

వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం భారత్‌ , పాక్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ వర్షం కోసం ఎదురు చూసే ఒక ఫోటో ఫోజిచ్చాడు. అందులో నడుముపై రెండు చేతులు ఆనించి మబ్బులవైపు చూస్తున్నాడు. అదే ఫోటోతో పాటు తన చిన్నప్పటి అదే ఫోజులోని మరో ఫొటోని జతచేశాడు.  తాను 1990ల నాటి నుంచి ఇదే చేస్తున్నా అంటూ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

 

టీమిండియా సారథి విరాట్‌కోహ్లీ ట్విటర్‌లో షేర్ చేసిన ఈ ఆసక్తికర ఫోజు గల ఆ ఫొటో ఇప్పుడు అభిమానులను ఎంతగానో అలరిస్తుంది. సోషల్ మీడియాలో ఈ ఫోటో తెరవైరల్ అవుతోంది.