Virat Kohli Test Catches: విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు.. వంద క్యాచులు అందుకున్న ఘనత

Virat Kohli Test Catches: ఇండియా క్రికెట్ టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో మైలురాయిని చేరుకున్నాడు. టెస్టుల్లో 100 క్యాచులు అందుకున్న ఆరో భారత క్రికెటర్ గా ఘనత సాధించాడు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 13, 2022, 01:03 PM IST
Virat Kohli Test Catches: విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు.. వంద క్యాచులు అందుకున్న ఘనత

Virat Kohli Test Catches: టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో మైలురాయి వచ్చిపడింది. టెస్టు ఫార్మాట్లో వంద క్యాచులు పట్టిన ఘనతను కోహ్లీ సాధించాడు. ఈ రికార్డు సాధించిన ఆరో భారత ఆటగాడిగా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలిచాడు. 

బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి ఇన్నింగ్స్‌ సందర్భంగా మహ్మద్ షమి వేసిన 56వ ఓవర్‌ విరాట్ కోహ్లీ ఈ ఘనతను అందుకున్నాడు. ఆ ఓవర్ లో రెండో బంతికి తెంబా బవుమా (28) ఇచ్చిన ఔట్‌సైడ్‌ ఎడ్జ్‌ క్యాచ్‌ను ఎంతో చాకచక్యంగా క్యాచ్‌ అందుకొన్నాడు. 

రెండో స్లిప్‌లో ఉన్న విరాట్‌ తన ఎడమచేతి వైపు డైవ్‌చేస్తూ నేలను తాకబోయిన బంతిని అద్భుతంగా ఒడిసిపట్టాడు. దీంతో అతడు టీమ్‌ఇండియా తరఫున టెస్టుల్లో వందో క్యాచ్‌ అందుకున్న ఆరో ఫీల్డర్‌గా నిలిచాడు.

అత్యధిక క్యాచులు అందుకున్న ఆటగాళ్లు

టీమ్‌ఇండియా తరఫున అత్యధికంగా రాహుల్‌ ద్రవిడ్‌ 209 టెస్టు క్యాచ్‌లు అందుకున్నాడు. హైదరాబాద్‌ సొగసరి బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ 135 క్యాచ్‌లతో రెండో స్థానంలో నిలిచాడు. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందూల్కర్‌ 115, లిటిల్‌ మాస్టర్‌ సునీల్‌ గావస్కర్‌ 108, మణికట్టు స్పెషలిస్టు మహ్మద్‌ అజహరుద్దీన్‌ 105, విరాట్‌ కోహ్లీ 100, అజింక్య రహానె 99, వీరేందర్‌ సెహ్వాగ్‌ 90 క్యాచ్‌లతో వరుస స్థానాల్లో ఉన్నారు. 

అయితే విరాట్‌ కోహ్లీ పట్టిన ఈ క్యాచ్‌ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. అభిమానులు దీన్ని ఇతరులకు షేర్‌ చేస్తూ ఆనందిస్తున్నారు. మీరూ కోహ్లీ వందో క్యాచ్‌ను ఎలా పట్టాడో ఓ లుక్కేయండి. 

Also Read: India Open 2022 Corona: ఇండియా ఓపెన్ లో కరోనా కలకలం.. ఏడుగురు షట్లర్లకు కొవిడ్ పాజిటివ్

Also Read: Shahid Afridi Sex Scandal: సెక్స్ స్కాండిల్ లో ఇరుక్కున్న పాక్ క్రికెటర్.. ఫ్యాన్ గర్ల్ తో రాసలీలలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News