విశాఖ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో విండీస్ ముందు టీమిండియా భారీ లక్ష్యాన్ని ఉంచింది. విజయ లక్ష్యాన్ని 322 పరుగులుగా నిర్దేశించింది. విరాట్ కోహ్లీ సెంచరీతో కదం తొక్కడంతో ఈ మేరకు భారీ స్కోర్ సాధ్యపడింది. ఈ మ్యాచ్ లో 157 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన కోహ్లీ 13 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. విరాట్ కోహ్లీకి అంబటి రాయుడు (73) చక్కటి సపోర్టు ఇచ్చాడు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 321 పరుగులు చేయగల్లింది. ఇక మిగిలిన బాట్స్ మెన్ల విషయానికి వస్తే శిఖర్ ధావన్ 29 పరుగులు, ఎంఎస్ ధోనీ 20, ఆర్ఆర్ పంత్ 17, ఆర్ఏ జడేజా 13 పరుగులు చేశారు. విండీస్ తరఫున మకోయ్, ఏఆర్ నర్స్ లు చెరో రెండు వికెట్లు తీయగా..కేఏజే రోచ్, శామ్యూల్స్ చెరో ఒక వికెట్ తీశారు.