Riana Lalwani details: క్రికెట్ ప్రియులను షేక్ చేసిన ఈ రియానా లల్వాని ఎవరు ?

Who is Riana Lalwani: రియానా లల్వాని.. ఎవరీ రియానా లల్వానీ.. ఏం చేస్తుంది ? సినిమా హీరోయినా ? టాప్ మోడలా ? ఫేమస్ క్రికెటర్‌కి సీక్రెట్ గాళ్ ఫ్రెండా ? లేదంటే పెద్ద బిజినెస్‌మేన్‌కి కూతురా ? ( Riana Lalwani whereabouts ) ఇంతకీ ఇంత మంది ఇంటర్నెట్‌లో వెతుకుతున్న ఈ రియానా లల్వాని ఎవరో మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది. ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య సస్పెన్స్ థ్రిల్లర్‌ని తలపించిన ఆదివారం నాటి ఐపిఎల్ మ్యాచ్‌ తర్వాత ఈ మిస్టరీ గాళ్‌ ఫోటో వైరల్ అయ్యింది.

Last Updated : Oct 20, 2020, 10:55 AM IST
Riana Lalwani details: క్రికెట్ ప్రియులను షేక్ చేసిన ఈ రియానా లల్వాని ఎవరు ?

Who is Riana Lalwani: రియానా లల్వాని.. ఎవరీ రియానా లల్వానీ.. ఏం చేస్తుంది ? సినిమా హీరోయినా ? టాప్ మోడలా ? ఫేమస్ క్రికెటర్‌కి సీక్రెట్ గాళ్ ఫ్రెండా ? లేదంటే పెద్ద బిజినెస్‌మేన్‌కి కూతురా ? ( Riana Lalwani whereabouts ) ఇంతకీ ఇంత మంది ఇంటర్నెట్‌లో వెతుకుతున్న ఈ రియానా లల్వాని ఎవరో మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది. రియానా లల్వానీ అనే పేరు ఎందుకు అంత ఫేమస్ అయ్యిందో తెలుసుకోవాలంటే అంతకంటే ముందుగా ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ( MI vs KXIP Match mystery girl Riana Lalwani) జట్ల మధ్య సస్పెన్స్ థ్రిల్లర్‌ని తలపించిన ఆదివారం నాటి ఐపిఎల్ మ్యాచ్ గురించి చర్చించుకోవాలి. Also read : KXIP vs MI Super Over: పాత రూల్ ఉంటే విజయం ఎవరిది? రెండో సూపర్ ఉండదు

క్రికెట్‌లో ఒక మ్యాచ్ డ్రా అయితేనే ఆ సస్పెన్స్ తట్టుకోవడం కష్టం అంటే.. ఆ తర్వాత జరిగిన సూపర్ ఓవర్ కూడా టై అవడం ఐపిఎల్ ప్రియులను ఇంకెంత ఉత్కంఠకు గురిచేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆద్యంతం ఉత్కంఠకు గురిచేసిన ఈ క్రికెట్ మ్యాచ్‌ని టీవీల్లో చూస్తున్న వారి దృష్టిని తనవైపు తిప్పుకునేలా చేసిన బ్యూటీఫుల్ లేడీనే ఈ రియానా లల్వాని. సూపర్ ఓవర్ జరుగుతున్న సమయంలో స్క్రీన్‌పై కొన్ని క్షణాలపాటు ఈ బ్యూటీ తళుక్కుమంది. Also read : MI vs KXIP Super Over: ముంబైపై ఉత్కం‘టై’.. రెండో సూపర్ ఓవర్‌లో పంజాబ్ విజయం

స్టేడియంలో ప్రత్యక్షంగా మ్యాచ్‌ని వీక్షిస్తున్న ఈ బ్యూటీ.. సూపర్ ఓవర్‌లో నరాలు తెగేలా కొనసాగిన సస్పెన్స్‌ని భరించలేక గోళ్లు కొరుకుతూ, మ్యాచ్ చూస్తూ కనిపించింది. అంత సస్పెన్స్ మధ్య అంతసేపు స్క్రీన్ పై తళుక్కుమన్న ఆ బ్యూటీ ఎవరనే సందేహం అందరి మెదళ్లను తొలిచింది. అది మొదలు ఆమె ఎవరో తెలుసుకునే పనిలో పడ్డారు నెటిజెన్స్. ఎట్టకేలకు ఆమె పేరు రియానా లల్వాని అని తెలుసుకున్న నెటిజెన్స్.. ఇంతకీ ఎవరీ రియానా లల్వాని అని ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే రియానా లల్వాని ట్విటర్ ( Riana Lalwani twitter ), ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను ( Riana Lalwani instagram ) ఫాలో అవడం మొదలుపెట్టారు. దీంతో రియా లల్వానికి సోషల్ మీడియాలో అమాంతం భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. Also read : DC vs CSK match highlights: చెన్నైని రఫ్పాడించిన శిఖర్ ధావన్.. ఢిల్లీ విజయం

కొవిడ్-19 ( COVID-19) వ్యాపించకుండా బయో బబుల్ ( Bio-bubble ) నిబంధనల మధ్య ఆడియెన్స్ లేకుండా జరుగుతున్న స్టేడియంలో ఆమె మ్యాచ్ చూస్తూ కనిపించిందంటే.. కచ్చితంగా ఆమె ఎవరో కానీ ఆ రెండు ఫ్రాంచైజీలకు చెందిన లేడీనే అయ్యుండాలి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎంతోమంది క్రికెట్ ప్రియులు, నెటిజెన్స్‌కి మిస్టరీ గాళ్‌గా మారిన ఈ రియా లల్వాని గతేడాది ఐపిఎల్ సీజన్‌లో ఇలాగే తెరపై కనిపించిన దీపికా ఘోష్‌ని గుర్తుచేసింది. అప్పట్లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు పాల్గొన్న ఓ ఐపిఎల్ మ్యాచ్‌లో తళుక్కుమన్న దీపికా ఘోష్ గురించి కూడా నెటిజెన్స్ ఇలాగే ఆరాతీశారు. ఆమె పేరుకి ముందు ఆర్సీబీ గాళ్ ( RCB girl Deepika Ghosh ) అనే ట్యాగ్ కూడా పెట్టేశారు. Also read : RCB vs KXIP match, IPL 2020: రెచ్చిపోయిన క్రిస్ గేల్, రాహుల్.. కోహ్లీ సేనపై పంజాబ్ విజయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News