Venu Swamy: వేణు స్వామికి గట్టి షాక్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు..

Venu Swamy: తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఫేమస్ అయిన ప్రముఖ జ్యోతిష్య పండితుడు వేణు స్వామికి తెలంగాణ హైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. అంతేకాదు వారం రోజుల్లో  వేణు పరాంకుశం స్వామి కేసులో చర్యలు తీసుకోవచ్చని మహిళా కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 

Written by - TA Kiran Kumar | Last Updated : Oct 28, 2024, 01:54 PM IST
Venu Swamy: వేణు స్వామికి గట్టి షాక్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు..

Venu Swamy:  తెలుగు రాష్ట్రాల్లో తన జాతకాలతో అతి తక్కువ కాలంలో చాలా ఫేమస్ అయ్యారు వేణు స్వామి. ఇతరుల జాతకాలు చెప్పడంలో బిజీగా ఈయన పండితుడు  తన జాతకం చూసుకోవడం మర్చిపోయినట్టున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా నాగ చైతన్య, శోభితా ధూళిపాల ఎంగేజ్మెంట్ తర్వాత ..వాళ్లిద్దరు కలిసి ఉండలేరు. పెళ్లి తర్వాత విడిపోతారు అని కామెంట్స్ చేయడం పెద్ద వివాదానికి దారి తీసింది.

మంచి ఉంటే పది మందిలో చెప్పాలంటారు. చెడును మాత్రం చెవిలో చెప్పమని మన పెద్దలు చెబుతుంటారు. దాన్ని విస్మరించిన ఈ పండితుడ మహాశయుడు.. అతితో అసలు వాళ్లు అడక్కపోయినా.. వాళ్ల జాతకంలో ఏదో తేడా ఉందని చెప్పడంతోనే ఈ రచ్చ మొదలైంది.

వేణు పరాంకుశం స్వామి పై ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ చేసిన ఫిర్యాదు మేరకు తన ముందు హాజరు కావాలని గతం లో వేణుని ఆదేశించిన మహిళా కమిషన్.మహిళా కమిషన్ కు ఆ అధికారం లేదంటూ స్టే తెచ్చుకున్న వేణు స్వామి. ఈ రోజు ఆ స్టే ఎత్తివేస్తూ మహిళా  కమిషన్ కు పూర్తి అధికారాలున్నాయని పేర్కొంటూ  హై కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు వారం రోజుల్లో వేణు స్వామిపై  తదుపరి చర్యలు తీసుకోమని కమిషన్ ను ఆదేశించింది ఉన్నత న్యాయస్థానం.

ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..

ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..

అప్పట్లో నాగ చైతన్య, సమంత మ్యారేజ్ తర్వాత వారి జాతకాల ప్రకారం వారిద్దరు ఎక్కువ కాలం కలిసి జీవించలేరు. వారు విడాకులు తీసుకుంటారని చెప్పారు. ఆ తర్వాత సామ్, చైతూ మధ్య ఏం జరిగిందో ఏమో వాళ్లిద్దరు విడిపోతున్నట్టు ప్రకటించి విడాకులు తీసుకున్నారు. దీంతో తాను చెప్పిన మాట ప్రకారమే వాళ్లిద్దరు విడిపోయారంటూ పలు యూట్యూబ్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ ఫేమస్ అయ్యారు వేణు స్వామి. పండితుడిగా ఆయనకు మంచి విద్వత్తు ఉన్నా.. ఒకరు అడక్కముందే వారి జీవితాలను బజారు పెట్టడం వంటివి చేయడం మూలానా.. జ్యోతిష్య పండితుడు వేణు స్వామి ప్రజల్లో పలుచన అయ్యారు. తాజాగా ఫిల్మ్ జర్నలిస్టు అసోసియేషన్ ఫిర్యాదు మేరకు ఆయనపై విచారణ మొదలైంది. హై కోర్టు ఆదేశాల మేరకు మహిళా  కమిషన్ ముందు హాజరవుతారా.. సుప్రీంకోర్టు వెళ్లి మళ్లీ ఈ విచారణపై స్టే తెచ్చుకుంటారా అనేది చూడాలి.

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x