ఆసియా క్రీడలు 2018 : నేటి సాయంత్రం 6:30కి బిగ్ ఫైట్

ఆసియా క్రీడలు 2018లో హాకీ మహిళల జట్ల ఫైనల్ మ్యాచ్‌లో భారత్ vs జపాన్

Last Updated : Aug 31, 2018, 06:04 PM IST
ఆసియా క్రీడలు 2018 : నేటి సాయంత్రం 6:30కి బిగ్ ఫైట్

ఆసియా క్రీడలు 2018లో ఈ రోజు సాయంత్రం 6:30 గంటలకు అసలైన బిగ్ ఫైట్ జరగనుంది. మహిళల హాకీ మ్యాచ్ ఫైనల్స్‌కి చేరుకుంది. నేడు మహిళల హాకీ ఫైనల్స్‌లో భారత్, జపాన్ జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. ప్రపంచ మహిళల హాకీ ర్యాంకింగ్స్‌లో భారత్ 9వ స్థానంలో ఉండగా ప్రస్తుతం జపాన్ 14వ స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన విజేత జట్టు 2020 ఒలింపిక్స్‌కి అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్ లో ఇండియా గెలిచినట్టయితే, 1982 తర్వాత భారత మహిళల హాకీ జట్టు స్వర్ణం గెలుచుకోవడం ఇదే మొదటిసారి కానుంది. దీంతో ప్రస్తుతం యావత్ ప్రపంచ హాకీ క్రీడాకారులు, హాకీ క్రీడా అభిమానుల దృష్టి అంతా ఈ ఫైనల్ మ్యాచ్ పైనే ఉంది. భారత్ గెలిచి 2020 ఒలంపిక్స్ కి అర్హత సాధించడంతోపాటు 36 ఏళ్ల తర్వాత భారత్ కి గోల్డ్ మెడల్ తీసుకొస్తుందా లేదా అంటే ఈ మ్యాచ్ ఫలితం తేలేవరకు వేచిచూడాల్సిందే.

 

Trending News