మోడీ సర్కార్ కు సుప్రీం షాక్ మరో షాకు తగింలింది.రోహింగ్యాల దుస్థితిపై కేంద్ర ప్రభుత్వం సున్నితంగా వ్యవహరించాలని ఆదేశించింది. జాతీయ భద్రత, శరణార్థుల సమస్యను ఎదుర్కొనే విషయంలో సమతూకం పాటించాల్సిలని ధర్మాసనం సూచించింది. అమాయక రోహింగ్యా మహిళలు, చిన్నారుల దుస్థితిని కోర్టు చూసీచూడకుండా వదిలేయలేయబోదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రోహింగ్యాల విషయంలో తాము నిర్ణయం తీసుకునే వరకు దేశంలోని రోహింగ్యాలను డిపోర్ట్ చేయకూడదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. రోహింగ్యాలను పంపించే విషయంలో ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుంటే..కోర్టును ఆశ్రయించవచ్చని కోర్టు పేర్కొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.