పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రాంతంలోని క్వెట్టాలో ఉన్న ఓ మసీదులో శుక్రవారం సాయంత్రం పేలుడు చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో ఓ పోలీస్ అధికారి సహా మొత్తం 15 మంది చనిపోగా మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం ప్రార్థనల సందర్భంగా పేలుడు చోటుచేసుకోవడంతో మృతుల సంఖ్యతో పాటు క్షతగాత్రుల సంఖ్య కూడా అధికంగానే ఉంది.