TS Medical staff recruitment notification:హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్‌లో పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్న తరుణంలో కరోనా రోగుల తాకిడిని తట్టుకోలేక ఆస్పత్రులు సైతం చేతులెత్తేసే పరిస్థితి తలెత్తింది. కరోనా రోగులకు తగినంత ఆక్సీజన్ నిల్వలు, రెమ్డిసివిర్ ఇంజెక్షన్స్ (Remdesivir injection) లేకపోవడం అందుకు ఓ కారణమైతే.. అసలు రోగుల సంఖ్యకు సరిపడే స్థాయిలో వైద్య సిబ్బంది లేకపోవడం మరో ప్రధాన సమస్యగా మారింది.
COVID-19 positive test reports: న్యూ ఢిల్లీ: కరోనాపై కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ... ''కరోనా లక్షణాలతో బాధపడే వారికి కొవిడ్ ఆస్పత్రుల్లో చేరాలంటే కరోనా పరీక్షలకు సంబంధించిన పాజిటివ్ రిపోర్ట్ అవసరం లేదు'' అని స్పష్టంచేసింది.
Fire accident at Covid-19 hospital: రాయ్‌పూర్: చత్తీస్ఘడ్ రాజధాని రాయ్‌పూర్‌లో కొవిడ్ 19 రోగులకు చికిత్స అందిస్తున్న రాజధాని ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో నలుగురు రోగులు అగ్నికి ఆహుతై సజీవ దహనమయ్యారు. ఫ్యాన్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగిన కారణంగా చెలరేగిన మంటలు ఆస్పత్రిలోని కొవిడ్-19 పేషెంట్స్ వార్డుకి వ్యాపించాయి.
గచ్చిబౌలిలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కోవిడ్-19 ఆసుపత్రిని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రతినిధుల బృందం శనివారం తనిఖీ చేసింది. గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ విలేజ్‌లో కరోనా ఐసోలేషన్ కేంద్రానికిగాను ప్రత్యేకంగా 1,500 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.