Gujarat Second Phase Election: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో ఓటింగ్ ప్రారంభం కానుంది. నేడు ప్రధాని మోదీ, అమిత్ షా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 93 స్థానాలకు పోలింగ్ జరగనుంది.
BJP Manifesto For Gujarat Assembly Elections: గుజరాత్ ప్రజలపై బీజేపీ హామీల వర్షం కురిపించింది. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. గుజరాత్లో వ్యవసాయాభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయిస్తామని ప్రకటించింది.
గుజరాత్ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని పటేళ్ల వర్గం నాయకుడు హార్ధిక పటేల్ ఆరోపించారు. పటేళ్ల ప్రాబల్యం అధికంగా ఉన్న సౌరాష్ట్రలో 42 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, ప్రస్తుత సమాచారం బట్టి అక్కడ బీజేపీ 22, కాంగ్రెస్ 19 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో హార్ధిక్ పటేల్ పలు ఆరోపణలు చేశారు.ఈవీఎంల ట్యాంపరింగ్ పై విచారణ జరిపి రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.
ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన జాబితాలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కు దాటి ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్ 92కు పైగా స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఐదో రౌండ్ ఫలితాల వరకూ విజయలక్ష్మి దోబూచులాడుతుండటంతో కాస్తంత ఆందోళనగా కనిపించిన బీజేపీ శ్రేణులు, ఆపై ఫలితాల సరళి తమకు అనుకూలంగా మారడంతో గాంధీనగర్ పార్టీ కార్యాలయం వద్ద కోలాహలం మొదలైంది. ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చి మిఠాయిలు పంచుకుంటున్నారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలోనూ సంబరాలు ప్రారంభమయ్యాయి.
గుజరాత్ కౌంటింగ్ ట్రెండ్ క్షణక్షణానికి మారుతూ ఉత్కంఠతను రేపుతున్నాయి. విజయం కాంగ్రెస్-బీజేపీల మధ్య దోబూచులాడోంది. ఆరంభంలో బీజేపీ వైపు ఉండగా..తర్వాత కాంగ్రెస్ వైపు వెళ్లింది..ఇంతలోనే మళ్లీ బీజేపీ వైపు మళ్లీంది. ప్రస్తుతం బీజేపీ 105 స్థానాల్లో ముందంజలో ఉండగా.. కాంగ్రెస్ 75 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. ట్రెండ్స్ ను బట్టి చూస్తుంటే, గుజరాత్ లో హోరాహోరీ పోరు జరిగిందనే విషయం అర్థమవుతోంది.
గుజరాత్ లో అధికార భాజపా ముందంజలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తోంది. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల ప్రకారం భాజపా 90 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. కాంగ్రెస్ 88 స్థానాల్లో ముందంజలో ఉంది. అయితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపాని వెనుకంజలో ఉండటం గమనార్హం. రాజ్‌కోట్ పశ్చిమ నియోజకవర్గంలో విజయ్ రూపానిపై కాంగ్రెస్ అభ్యర్థి ఇంద్రనీల్ రాజ్‌గురు ఆధిక్యంలో ఉన్నారు.కాంగ్రెస్, భాజపాల మధ్య పోటీ నువ్వా?, నేనా? అన్నట్లు ఉండటంతో ఇక్కడ ఎవరూ విజయం సాధిస్తారన్నదానిపై అందరిలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
గుజరాత్ లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హరోహోరి పోరు నడుస్తోంది. కౌటింగ్ ప్రారంభమైన తొలి గంట వరకు బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చింది..ఆ తర్వాత అర్థగంటలో కాంగ్రెస్ ఒక్కసారిగా ఆధిక్యాన్ని కనబరిచి బీజేపీని వెనక్కి నెట్టేసింది. దీంతో పోరు నువ్వునేనా అనే స్థితిలోకి వచ్చింది. ప్రస్తుతం కమలం పార్టీ 84 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా ..కాంగ్రెస్ 88 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎన్నికల ప్రారంభానికి ముందు గుజరాత్లో బీజేపీ గెలుపు నల్లేరుపై నడకేనని అందరూ భావించారు. అయితే ఒక్కసారిగా గాలి కాంగ్రెస్‌వైపు మళ్లింది. దీంతో ప్రచారం హోరాహోరీగా సాగింది.
గుజరాత్ లో ఎన్నికల కౌటింగ్ కొనసాగుతోంది. ఆరంభం నుంచే బీజేపీ ముందుంజలో ఉంది.కౌంటింగ్ ప్రారంభమైన అర్థగంట వ్యవధిలో ప్రస్తుతం ఆ పార్టీ 70 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా ..కాంగ్రెస్ 42 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎన్నికల ప్రారంభానికి ముందు గుజరాత్లో బీజేపీ గెలుపు నల్లేరుపై నడకేనని అందరూ భావించారు. అయితే ఒక్కసారిగా గాలి కాంగ్రెస్‌వైపు మళ్లింది. దీంతో ప్రచారం హోరాహోరీగా సాగింది. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ ప్రధానిపై చేసిన ‘నీచ్’ వ్యాఖ్యలతో వాతావరణం మళ్లీ ఒక్కసారిగా మారిపోయింది. గాలి మళ్లీ బీజేపీ వైపు మళ్లింది.
గుజరాత్ రెండో దశ ఎన్నికల్లో భాగంగా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌లోని వెజల్ పూర్లో ఏర్పాటు చేసిన 961వ పోలింగ్ బూత్‌లో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ క్యూ లైన్లో నిల్చుని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ మెహసనలోని కాడి పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ నేత జీవాభాయి పటేల్ పై నితిన్ పటేల్ పోటీ చేస్తున్నారు. పటిదార్ అనామత్ ఆందోళన్ సమితి అధ్యక్షుడు హార్ధిక్ పటేల్ విరామ్ గ్రామ్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరితో పాటు పలువురు ప్రముఖలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
గుజరాత్ రెండో దశ ఎన్నికల గడువు ముగిసింది. చిరవి రోజు ప్రచారంలో భాగంగా ఈ రోజు కాంగ్రెస్,బీజేపీ నేతలు ఒకరినొకరు వాడీ వేడీ విమర్శలు సంధించుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కు చెందిన ఓబీసీ యువనేత నేత ఠాగుల్ అల్పేశ్ ఠాకూర్ ప్రధాని మోడీ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ.. ఒక ఒకప్పుడు నల్లగా ఉండే మోదీ ఇప్పుడు టమోటాలా తయారయ్యారు..దాని రహస్యమేంటో తెలుసా అంటూ..ఆయన ప్రతి రోజు తైవాన్ నుంచి తెప్పించే పుట్టగొడుగులు తింటారని ...అవి ఒక్కోటి 80 వేల రూపాయలు..ఇలాంటివి మోదీ రోజుకు ఐదు తింటారని చెప్పారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.